New Trend 2025: అందం అంటే ఆడవాళ్లకే సొంతం కాదు.. మగవాళ్లూ మెరిసిపోతున్నారు!
ఒకప్పుడు అందం అంటే మహిళలకి మాత్రమే సంబంధించిన విషయంగా భావించేవారు. ఫేస్ క్రీమ్, లిప్‌స్టిక్, హెయిర్ స్టైల్ – ఇవన్నీ ‘స్త్రీల విషయాలు’ అని మగవాళ్లు దూరంగా ఉండేవారు. ఒకవేళ ఎవరైనా అబ్బాయి మాయిశ్చరైజర్ రాసుకుంటే ‘ఇదెక్కడి లేడీస్ ఫ్యాషన్?’ అని టీజ్ చేసేవారు. కానీ ..

ఒకప్పుడు అందం అంటే మహిళలకి మాత్రమే సంబంధించిన విషయంగా భావించేవారు. ఫేస్ క్రీమ్, లిప్‌స్టిక్, హెయిర్ స్టైల్ – ఇవన్నీ ‘స్త్రీల విషయాలు’ అని మగవాళ్లు దూరంగా ఉండేవారు. ఒకవేళ ఎవరైనా అబ్బాయి మాయిశ్చరైజర్ రాసుకుంటే ‘ఇదెక్కడి లేడీస్ ఫ్యాషన్?’ అని టీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.
సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ ట్యూటోరియల్స్, రణ్వీర్ సింగ్ నుంచి విరాట్ కోహ్లీ వరకు సెలబ్రిటీలందరూ మగవాళ్లకు స్కిన్‌కేర్ రొటీన్ అనేది ఆరోగ్యం, కాన్ఫిడెన్స్, పర్సనల్ బ్రాండింగ్ అని నేర్పించారు. ఫలితంగా, ఇప్పుడు భారతీయ యువకులు మార్నింగ్ రొటీన్‌లో క్లెన్సర్, సీరమ్, సన్‌స్క్రీన్ లేకపోతే రోజు పూర్తి కాలేదన్నట్టు ఫీల్ అవుతున్నారు. జిమ్, డైట్, గ్రూమింగ్ అనేవి మగవాళ్ల డైలీరొటీన్గా భాగంగా మారిపోయాయి.
రోజులు మారాయి..
అమ్మాయిలే గంటలు గంటలు అలంకరించుకుంటారు అనే రోజులు మారాయి. ఇప్పుడు పురుషులు కూడా స్కిన్‌కేర్, ఫ్యాషన్‌పై చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఈ మార్పు కేవలం సౌందర్యం కోసం మాత్రమే కాదు, సమాజం మారుతోందనడానికి సంకేతం. ఇప్పుడు ఆఫీసు ఇంటర్వ్యూ, డేటింగ్ యాప్ ప్రొఫైల్, రీల్స్ షూట్ ఎక్కడైనా మొదటి ఇంప్రెషన్ లుక్‌తోనే వస్తుంది.
అందుకే మగవాళ్లు ఫేషియల్స్, లేజర్ హెయిర్ రిమూవల్, బోటాక్స్, జైనోకామాస్టియా సర్జరీలు చేయించుకోవడం సాధారణం అయిపోయింది. ఒకప్పుడు ‘అందం మీద ఖర్చు పెట్టడం అమ్మాయిల పని’ అనేవారు. ఇప్పుడు మగవాళ్లే స్కిన్‌కేర్ బ్రాండ్స్‌కు అతి పెద్ద కస్టమర్ బేస్. ఇది ఒక రకంగా జెండర్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తోంది. అందం, సెల్ఫ్-కేర్ అనేవి ఎవరివైనా సొంతం అని నిరూపిస్తోంది.
ఒకప్పుడు మగవారి రొటీన్ అంటే సాధారణ షేవింగ్, హెయిర్‌కట్, మామూలుగా ముఖం కడగడం మాత్రమే. కానీ ఇప్పుడు? స్కిన్‌కేర్, బీర్డ్ ఆయిల్స్, లేజర్ ట్రీట్‌మెంట్లు, లిపోసక్షన్ వంటి కాస్మెటిక్ సర్జరీల వరకు విస్తరించింది. భారతదేశంలో మెన్స్ గ్రూమింగ్ మార్కెట్ 2024లో USD 2.3 బిలియన్‌కు చేరి, 2025-2033 మధ్య 6.8% CAGRతో USD 4.3 బిలియన్‌కు చేరుకోనుందని IMARC రిపోర్ట్ తెలిపింది.
సోషల్ మీడియా, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, సెలబ్రిటీ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ మార్పుకు కారణం. యువకులు తమ లుక్‌ను మెరుగుపరచుకోవడం ఇక ‘వానిటీ’ కాదు, సెల్ఫ్-కాన్ఫిడెన్స్‌కు కీలకం. డైరెక్ట్-టు-కన్స్యూమర్ బ్రాండ్‌లు లాంటి ‘ది మ్యాన్ కంపెనీ’, ‘బోహెమ్’ బీర్డ్ ఆయిల్స్, సీరమ్‌లు, ఫేస్ వాష్‌లతో మార్కెట్‌ను క్యాప్చర్ చేశాయి. ఈ మార్కెట్ 42% పెరిగి, 2025 నాటికి $20 బిలియన్‌కు చేరుకోనుందని ASSOCHAM స్టడీ చెబుతోంది. కానీ ఇది ప్రొడక్ట్స్‌తో ఆగలేదు కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ల వైపు మళ్లింది. ఒకప్పుడు మహిళలకు మాత్రమే అనుకున్నవి ఇప్పుడు మగవారి టాప్ చాయిస్‌గా మారాయి.
