Viral News: సమోసా తెచ్చిన తంటా.. క్యాంటీన్ ఓనర్‌పై కేసు నమోదు.. అసలు మ్యాటర్ తెలిస్తే..
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్కూల్ క్యాంటీన్‌లో సమోసాలు తిని సుమారు ఏడుగురికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఇక సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు క్యాంటీన్ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

విద్యార్థులకు కలుషితమైన సమోసాలను విక్రయించి, వారి ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లించారని ఆరోపిస్తూ ఘట్కోపర్ పోలీసులు కె.వి.కె. స్కూల్ క్యాంటీన్ యజమాని సుందర్ గోపాల్ దేవడిగపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) చట్టంలోని సెక్షన్ 125 మరియు 275 కింద కేసు నమోదు చేసిన ఘటన ముంబైలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కోపర్ వెస్ట్‌లోని నిత్యానంద్ నగర్‌లోని బీట్ నంబర్ 3లో ఉన్న కెవికె స్కూల్‌కు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాల క్యాంటీన్‌కి వెళ్లారు. అక్కడ వాళ్లందరూ సమోసాలు ఆర్డర్ చేసుకొని తిన్నారు. అయితే తిన్న వెంటనే వారందరూ అస్వస్థతకు గురయ్యారు. తిన్న వెంటనే, విద్యార్థులు వికారం, వాంతులు చేసుకున్నారు.
విషయం తెలసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను హాస్పిటల్‌కు తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఆర్య తోథారే (14), వివేక్ నిర్మల్ (12), ముస్తఫా అన్సారీ (10), రాజిక్ ఖాన్ (11), అరుష్ సింగ్ గుప్తా (11), అఫ్జల్ షేక్ (11), అలీషా (12) ఉన్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. అయితే విద్యార్థులు తిన్న సమోసాలను ప్రిన్సిపాల్ కూడా తిని చూశానని.. అప్పుడు వాటిలో కర్పూరం లాంటి బలమైన వాసన వస్తోందని ఆయన తెలిపారు. ఆ వెంటనే స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్కూల్ క్యాంటీన్ పరిశీలించారు.
క్యాంటీన్‌లోని విద్యార్థులకు వడ్డించిన సమోసాలతో పాటు వాటిని తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులు, వాటి తయారీకి వాడిన నూనెను క్లూస్ టీం సేకరించి ల్యాబ్‌కు పంపారు. అలాగే క్యాంటీన్‌లోని నాలుగు గ్యాస్ సిలిండర్లు, వంట స్టవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్కూల్ క్యాంటీన్‌ను లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న అధికారులు గుర్తించారు. దీంతో క్యాంటీన్ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
