Watch Video: మొసలిని రౌండప్ చేసిన సింహాల గుంపు..! భీకర యుద్ధంలో గెలిచిందెవరో చూస్తే..
జంతువులకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. అలాగే ఆ వీడియో అప్పుడప్పుడూ మనకు కొన్ని సందేశాలను కూడా తెలియజేస్తాయి.. తాజాగా అలాంటి వీడియో ఇకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది..అదెంటో చూసేద్దాం పదండి.

జంతువులకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. అలాగే ఆ వీడియో అప్పుడప్పుడూ మనకు కొన్ని సందేశాలను కూడా తెలియజేస్తాయి.. తాజాగా అలాంటి వీడియో ఇకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ ట్రెండింగ్ వీడియోలో ఒంటరి మొసలిపై సింహాలు దాడి చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు.. ఈ వీడియో అడవిలోని క్రూరమైన ప్రపంచాన్ని వర్ణిస్తుంది. అలాగే బలం, ఐక్యతను తెలియజేసే సందేశాన్ని కూడా సూచిస్తుంది.
ఈ వైరల్ వీడియోలో, ఒక మొసలి అడవి మధ్యలో వెళ్తుండగా ఒక్కసారిగా ఒక సింహాల గుంపు దానిపై దాడి చేశాయి. దాదాపు 5-6 సింహాలు మొసలిని చుట్టుముట్టి, ఆపై వాటి గోళ్లు, పదునైన దంతాలతో ఒక్కొక్కటిగా ఆ మొసలిపై దాడి చేయడాన్ని మనం చూడవచ్చు. అయితే చాలా సేపు సింహాల నుంచి తనను తాను రక్షించుకున్న మొసలి.. చివరకు ఒక్కసారిగా వాటిపైకి తిరగబడింది. దాని చేతనైనంత వరకు ఆ సింహాలకు బయటపడకుండా పోరాడింది. చివరకు నిస్సాహయురాలిగా మారి.. ఆ ఆడవి మృగాలకు బలైపోయింది.
వీడియోకు ప్రజల స్పందన
ఈ అడవి జంతువులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @nature.decoded_ అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. అలాగే వేలల్లో లైక్స్ కూడా వచ్చాయి. దీన్ని చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో పంచుకున్నారు. మొసలిని చేస్తే నాకు జాలిగా ఉంది ఒక యూజర్ కామెంట్ చేయగా.. అడవిలో, ఎల్లప్పుడూ బలహీనులే బలైపోతారని మరో యూజర్ కామెంట్ చేశాడు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
