Viral video: ఈ కానిస్టేబుల్ చేసిన పనికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. మనసును హత్తుకుంటున్న వీడియో చూడాల్సిందే

|

Jun 15, 2022 | 8:48 AM

మానవత్వం కనుమరుగై పోతున్న ఈ రోజుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ మూగజీవాల కోసం పరితపిస్తున్నాడు. అతనిలోని జంతుప్రేమతో నోరులేని వానరాలకు అతడు నేస్తంగా మారాడు.

Viral video: ఈ కానిస్టేబుల్ చేసిన పనికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. మనసును హత్తుకుంటున్న వీడియో చూడాల్సిందే
Up Police
Follow us on

మానవత్వం కనుమరుగై పోతున్న ఈ రోజుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ మూగజీవాల కోసం పరితపిస్తున్నాడు. వాటికి ఆహారం అందిస్తూ నోరులేని వానరాలకు నేస్తంగా మారాడు. జంతువుల పట్ల సానుభూతి చూపే ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయబడతాయి. మానవళిని సజీవంగా ఉంచాలంటే, జంతువుల పట్ల ప్రేమ, కరుణ కూడా అవసరమే. ఈ క్రమంలోనే ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ కోతుల పట్ల ఔదార్యం ప్రదర్శించాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోలో కానిస్టేబుల్‌ కోతులకు మామిడి పండ్లను తినిపిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ పోలీసు కానిస్టేబుల్ పేరు మోహిత్. PRV1388 షాజహాన్‌పూర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చేసేది మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిన ఖాకీ కొలువు. కానీ, అతడు ఓ గొప్ప జంతుప్రేమికుడిగా గుర్తింపు పొందుతున్నాడు. కానిస్టేబుల్‌ మోహిత్‌కు సంబంధించిన ఓ వీడియోని యూపీ పోలీసులు షేర్‌ చేశారు. కాగా , ఆ వీడియో ప్రస్తుతం నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది.

ఇవి కూడా చదవండి

డ్యూటీ యూనిఫామ్‌తో తన జీపులో కూర్చుని ఉన్నాడు. ఎదురుగా ఓ కోతి తనవీపు మీద కోతిపిల్లను ఎత్తుకుని ఉంది. అతని చేతిలో మామిడిపండు కనిపిస్తోంది. పండు కోసిన అతడు కోతికి జాగ్రత్తగా అందించాడు. అది తీసుకున్న తల్లి కోతి తన బిడ్డతో పాటు అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మరో ముక్కను కోసి కాస్త దూరంగా ఉన్న కోతికి విసిరాడు. ఈ మండుటెండలో మామిడికాయను ఆస్వాదించాలని ఎవరికి ఉండదు? అలాగే మామిడి పండ్లను చూసిన కోతులు కూడా సంతోషంగా తింటున్నాయి. ఆకలితో అలమటిస్తున్న వానరాలకు పోలీస్ కానిస్టేబుల్‌ పండ్లు తినిపిస్తున్న ఈ వీడియో నెట్టిజన్ల మనసు గెలుచుకుంది.

ఈ వీడియోను యూపీ పోలీసులు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వెల్ డన్ కానిస్టేబుల్ మోహిత్ అంటూ ఉన్నతాధికారులు అతడు చేసిన మంచిపనిని మెచ్చుకుంటున్నారు. ఈ 17 సెకన్ల క్లిప్ అందరి హృదయాలను గెలుచుకుంది. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత, వీడియోను 60 వేలకు పైగా (60.2k వీక్షణలు) వీక్షించారు ఇప్పటివరకు మూడున్నర వేల మంది (3560 మంది లైక్‌లు) వీడియోను లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి