వృద్ధురాలైన అత్తపై టెక్కీ కోడలు దాడి.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు..వీడియో వైరల్

అయితే, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆకాంక్ష, ఆమె తల్లిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వీడియోలో కోడలు, ఆమె తల్లితో కలిసి, అత్తగారి జుట్టు పట్టుకుని లాగడం, చెంపదెబ్బ కొట్టడం, తన్నడం, నేలపై పడేసి దారుణంగా కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటికీ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వృద్ధురాలైన అత్తపై టెక్కీ కోడలు దాడి.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు..వీడియో వైరల్
Up Domestic Violence

Updated on: Aug 06, 2025 | 7:01 PM

వయసు పై బడిన అత్తపై కోడలు దాడి చేసిన దారుణ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. కవి నగర్‌లో ఉంటున్న ఆకాంక్ష అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన అత్తతో గొడవ పడింది. ఈ క్రమంలో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసింది. కింద పడేసి తీవ్రంగా కొట్టింది. జులై 30న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు కోడలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటన దృశ్యాలలో ఆకాంక్ష, ఆమె అత్త సుదేశ్ దేవిని కొడుతూ, నేలపై పడవేసి లాక్కెళ్లడం కనిపిస్తుంది. ఈ సంఘటన మొత్తం ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

బాధితురాలు సుదేశ్ దేవి, ఆమె భర్త సత్యపాల్ సింగ్ గత ఆరు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ, పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోయారు.. మొదట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని తెలుస్తోంది. ఆకాంక్ష తండ్రి ఢిల్లీ పోలీసులలో సబ్-ఇన్స్పెక్టర్ అని, అతను తరచుగా తమను బెదిరిస్తున్నట్టుగా బాధితురాలు ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అయితే, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆకాంక్ష, ఆమె తల్లిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వీడియోలో కోడలు, ఆమె తల్లితో కలిసి, అత్తగారి జుట్టు పట్టుకుని లాగడం, చెంపదెబ్బ కొట్టడం, తన్నడం, నేలపై పడేసి దారుణంగా కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటికీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…