Viral Video: ఇదెక్కడి వెర్రీ.. ఫ్యాషన్ పిచ్చి ఏకంగా తలకెక్కింది.. ఈ హెయిర్ స్టైల్ చూస్తే మీరూ అదే అంటారు..

|

Jul 30, 2022 | 8:53 PM

దుస్తులు, ముఖం, చెప్పుల దగ్గర్నుంచి జుట్టు వరకు ప్రతి దానిలోనూ ట్రెండ్ గా కనిపించాలనుకుంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో లైక్స్, వ్యూస్ కోసం తమ శరీరంపై అనేక

Viral Video: ఇదెక్కడి వెర్రీ.. ఫ్యాషన్ పిచ్చి ఏకంగా తలకెక్కింది.. ఈ హెయిర్ స్టైల్ చూస్తే మీరూ అదే అంటారు..
Viral Video
Follow us on

వెర్రి వెయ్యి రకాలు అనే సామెతను చాలా సందర్భాల్లో విని ఉంటాము. నిజమే.. ఈ ప్రపంచంలో ఒక్కో వ్యక్తి కొన్ని ఇష్టాలను కలిగి ఉంటాడు. కొందరు సింప్లిసిటీగా ఉండేందుకు ఇష్టపడితే మరికొందరు ఎప్పుడూ స్టైలీష్, ట్రెండీగా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దుస్తులు, ముఖం, చెప్పుల దగ్గర్నుంచి జుట్టు వరకు ప్రతి దానిలోనూ ట్రెండ్ గా కనిపించాలనుకుంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో లైక్స్, వ్యూస్ కోసం తమ శరీరంపై అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ యువకుడు తన జుట్టుపై వినుత్న ప్రయోగం చేశాడు. అతడి హెయిర్ స్టైల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

అందులో ఓ వ్యక్తి జుట్టుతో సరికొత్త స్టైల్ ప్రయోగించాడు. తన జుట్టుపై ఏకంగా గుర్రం లుక్ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. అచ్చం గుర్రంలా కనిపించేందుకు తన జుట్టును మార్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ హెయిల్ చేసిన స్టైలీస్ట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.