రోడ్లపై గుంతలు ఉంటే వాహనదారులు, పాదచారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటిని పూడ్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కొ విధంగా ప్రయత్నిస్తారు. అయితే యూకేకు చెందిన మార్క్ మోరెల్ అనే వ్యక్తి కూడా పదేళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నారు. బ్రిటన్ లో ఎక్కడైన రోడ్లు సక్రమంగా లేకపోవడాన్ని చూస్తే ఆయన తట్టుకోలేరు. రోడ్లను మరమ్మతు చేయించేందుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. నీరు నిండిన గుంతల్లో రబ్బరు బాతులను వదలడం, గుంతలు పుట్టిన రోజు వాటికి కేక్ లు తినిపించడం, చేపలు పట్టే కొక్కేలను పెట్టడం లాంటి వింత పనులు చేసేవారు. అయితే ఇవేమి కూడా ఆయన అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయాయి.
బ్రిటన్ల రోడ్ల దుస్థితిని అందరి దృష్టికి తేవడం కోసం మార్క్ పాట్ నూడుల్స్ అనే కంపెనీ సహకారాన్ని పొందాడు. గుంతలు ఉన్నచోట పాట్ నూడుల్స్ తో నింపుతున్నాడు. రోడ్లను సరైన విధంగా ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని తాను పదేళ్లుగా ప్రచారం చేస్తున్నానని మార్క్ తెలిపాడు. అయితే తాను చేసే పనులకు ఇప్పటికీ పరిష్కారం దొరకడం లేదని.. అందువల్లే న్యూడిల్స్ తో స్టంట్ చేస్తూ ప్రజలకు, అధికారులకు అవగాహన కల్పిస్తున్నానని చెప్పాడు. రోడ్లపై గుంతల వల్ల కొంతమంది సెకిలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని..మరికొంత మంది తీవ్రంగా గాయపడుతున్నారని తెలిపాడు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ సమస్యలను నివారించవచ్చవని చెబుతున్నాడు మార్క్.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..