చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు దూషించుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం మనుషులకు సహనం తక్కువ అయింది. తన ఆలోచనలు వ్యతిరేకంగా చిన్న విషయం జరిగినా తట్టుకోలేకపోతున్నారు. ఒకరితోనొకరు మాట్లాడుకోవడం మానేస్తున్నారు. లేదా గొడవలు పడుతున్నారు. ఒకొక్కసారి కోపం హద్దులు దాటి.. ఒకరితో ఒకరు కొట్టుకోవడం వరకూ వెళ్తున్నారు. అనవసరంగా గొడవలు పెట్టుకోవడమే కాదు.. ఒక్కోసారి ఒకరి ప్రాణం తీసే వరకూ వెళ్తున్నారు కూడా. ఇలా జరగడానికి కారణం.. అదుపులేని కోపం కారణం అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇద్దరు లాయర్లు.. కోర్టు ఆవరణలోనే సిగపట్లు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారు. నవ్వుతారు కూడా.
నిజానికి, ఈ వీడియోలో, ఇద్దరు మహిళా న్యాయవాదులు ఏదో ఒక విషయంపై ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. వారి మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. హద్దులు దాటిన కోపంతో ఇద్దరు లాయర్లు ఒకరి జుట్టుని మరొకరు పట్టుకుని.. కొట్టుకున్నారు. అంతేకాదు.. ఇద్దరూ చెంపదెబ్బల వర్షం కూడా కురిపించుకున్నారు. వీడియోలో ఒక మహిళా న్యాయవాది నేల మీద నుంచి లేచి.. వెంటనే మరో మహిళా లాయర్‌తో గొడవపడుతుంది. అవతలి మహిళ లాయర్ కూడా తనకు ఏమీ తక్కువ కాదన్నట్లు.. కొట్లాటకు దిగింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చెంపదెబ్బలు కొట్టుకున్నారు. చివరికి ఒక లేడీ పోలీస్ జోక్యం చేసుకుని ఇరువురు లాయర్లను విడిపించింది. ఆ సమయంలో కోర్టు ఆవరణలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇద్దరు స్త్రీలు గొడవ పడుతుంటే వినోదం చూస్తున్నారు కానీ ఇద్దరినీ విడిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అదే సమయంలో కొంత మంది ఈ గొడవను వారి మొబైల్‌లలో వీడియో తీసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.
ఇద్దరు లాయర్లు.. కోర్టు ఆవరణలోనే సిగపట్లు
Kalesh B/w Two Ladies Lawyer inside Courtpic.twitter.com/6DoDdO5wjC
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 28, 2022
మహిళా న్యాయవాదుల ఈ పోరాట వీడియో @gharkekalesh అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో షేర్ చేశారు. 45 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 68 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు.
అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఫన్నీగా వ్యాఖ్యానిస్తూ, ‘ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారో.. ఆ లాయర్ క్లయింట్ కేసు గెలుస్తాడు’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఇటువంటి గొడవలను ఆపాల్సిన వారు.. పోరాటం ప్రారంభిస్తే మనం ఏమి చేయాలి’ అని వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..