Snake: పాములపై కోపం.. మద్యం మత్తులో విషపూరిత సర్ఫాన్ని తిన్న యువకులు.. ఆ తర్వాత ఏమైందంటే..

Two Drunkards Eat Poisonous Snake: పాములు తరచూ తమ ప్రాంతంలోకి వచ్చి కాటేస్తున్నాయని.. ఇద్దరు యువకులు సగం కాలిన పాముపై ప్రతీకారం తీర్చుకున్నారు. మద్యం మత్తులో ఇద్దరూ కలిసి సగం

Snake: పాములపై కోపం.. మద్యం మత్తులో విషపూరిత సర్ఫాన్ని తిన్న యువకులు.. ఆ తర్వాత ఏమైందంటే..
Eat Poisonous Snake
Follow us

|

Updated on: Sep 07, 2021 | 12:37 PM

Two Drunkards Eat Poisonous Snake: పాములు తరచూ తమ ప్రాంతంలోకి వచ్చి కాటేస్తున్నాయని.. ఇద్దరు యువకులు సగం కాలిన పాముపై ప్రతీకారం తీర్చుకున్నారు. మద్యం మత్తులో ఇద్దరూ కలిసి సగం కాలిన విషపూరిత పామును తిన్నారు. అనంతరం వారిద్దరూ అస్వస్తతతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ఇందిరా నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు సగం కాలిన విషపూరిత పామును తిని స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారి పరిస్థితి విషమించడంతో స్థానికులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వారు కోలుకున్న అనంతరం కుటుంబసభ్యులు, వైద్యులు వారిని ప్రశ్నించగా.. మద్యం మత్తులో సగం కాలిన పామును తిన్నామంటూ చెప్పడంతో.. వారంతా షాక్‌కు గురయ్యారు. తమ ప్రాంతంలో తరచుగా చాలామంది పాము కాటుకు గురవుతున్నారని.. దీంతో మద్యం మత్తులో ప్రతీకారం తీర్చుకునేందుకు కోపంతో పామును తిన్నట్లు యువకులు వెల్లడించారు. ఈ వింత సంఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు వైద్యులు తెలిపారు.

ఇందిరానగర్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ పాము కనిపించగా.. స్థానికులు దానిని చంపి కాలువ దగ్గర కాల్చారు. అయితే.. అది సగం మాత్రమే కాలిపోయింది. స్థానికులైన రాజు జంగ్డే, హితేంద్ర ఆనంద్ మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నారు. కాలువ దగ్గర సగం కాలిన పామును చూసి..వారిద్దరూ కోపంతో ఒకరి తర్వాత ఒకరు తినడం ప్రారంభించారు. పామును తిన్న తర్వాత ఇద్దరికీ వాంతులు మొదలయ్యాయి. అనంతరం స్పృహ కోల్పోయిన వారిద్దరినీ.. కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మద్యం మత్తులో తాము ఇలా చేసినట్లు రాజు, హితేంద్ర వైద్యులకు తెలిపారు. కొన్ని రోజులుగా పాములు తమ ప్రాంతంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని.. అందుకే కోపంతో పామును తిన్నట్లు వెల్లడించారు. కాగా యువకులు తిన్న పాము బెలియా క్రైట్ జాతికి చెందినదని.. ఇది కాటేస్తే 15 నిమిషాల్లో చనిపోవడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read:

Crime News: దారుణం.. ఒంటరిగా ఉన్న బాలికపై ఆటో డ్రైవర్ల కన్ను.. కిడ్నాప్‌ చేసి సిటీ అంతా తిప్పుతూ..

Crime News: తల్లి ఆడిస్తుండగా చిన్నారిని కాటేసిన తాచుపాము.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!