Viral Video: పడగ విప్పిన నాగుపాము..! వెనకకు పాకుతూ హెచ్చరించింది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Viral Video: పాములలో ప్రత్యేకమైనది నాగుపాము. కొంతమంది దీనిని దైవ సమానంగా భావిస్తారు. నాగుపాము పడగ విప్పిందంటే ఎవ్వరైనా భయపడాల్సిందే.
Viral Video: పాములలో ప్రత్యేకమైనది నాగుపాము. కొంతమంది దీనిని దైవ సమానంగా భావిస్తారు. నాగుపాము పడగ విప్పిందంటే ఎవ్వరైనా భయపడాల్సిందే. కాటు వేసిందంటే నిమిషాలలో ప్రాణాలు గాల్లో కలుస్తాయి. అయితే వర్షాకాలంలో ఇవి ఎక్కువగా పాడు బడిన ఇళ్లలో, పశువుల పాకలలో దర్శనమిస్తుంటాయి. వాటికి ఎటువంటి హాని చేయకపోతే వాటి దారిని అవి వెళ్లిపోతాయి కానీ చంపడానికి ప్రయత్నిస్తే ఆత్మరక్షణ కోసం అది కూడా కాటువేయడానికి సాహసం చేస్తుంది.
తాజాగా ఓ ఇంట్లోకి ఓ నాగుపాము చొరబడింది. అయితే ఓ మహిళ దానిని చాకచక్యంగా బయటకు పంపించడం మనం వీడియోలో చూడవచ్చు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ మహిళ పామును చూసిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండటం మనం గమనించవచ్చు. ఆమె ముఖంలో ఎటువంటి భయందోళన కనిపించదు. అంతేకాదు ఆమె ఒక పొడవైన స్టిక్‌ని పట్టుకొని ఆ పామును నెమ్మదిగా బయటకు పంపించడానికి ప్రయత్నించడం మనం వీడియోలో చూడవచ్చు.
కొద్దిసేపటికి పాము ఇంటి నుంచి బయటకు వస్తుంది. కానీ కోబ్రా వెనుకకు పాకుతూ ఆ మహిళ వైపు చూస్తు ఉంటుంది. అంతేకాదు ఆ మహిళను బెదిరించినట్లుగా ప్రవర్తిస్తుంది. అయితే మొదటగా ఆ మహిళ కర్రను పట్టుకోవడంతో అందరు పామును చంపుతుందని అనుకున్నారు. కానీ ఆమె అలా చేయలేదు. నెమ్మదిగా బయటకు పంపించడానికి మాత్రమే ప్రయత్నించింది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. మరికొందరు జంతు ప్రేమికులు మూగ జంతువులను కాపాడటం మన బాధ్యత అంటు కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Don’t know who this compassionate woman is but hats off to her for her handling of the snake with three Cs – Cool, Calm and collected. We need more people like her who respect wildlife ??#Respectwildlife vc-shared pic.twitter.com/ZLQAE3B3C3
— Supriya Sahu IAS (@supriyasahuias) September 6, 2021