Viral: స్పామ్ కాల్స్‌తో చిరాకొస్తోందా? ఇలా ట్రై చేయండి.. ఈ మహిళ ఏం చేసిందో చూస్తే..!
తక్కువ ఈఎంఐకి లోన్ కావాలా.? క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది తీసుకుంటారా.? డీటీహెచ్ ఆఫర్లు ఉన్నాయి మీకేమైనా కావాలా.? ఇలా ఒకటేమిటి తెల్లారే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల స్పామ్ కాల్స్ ప్రతీరోజూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. వీటి బెడదను తప్పించుకునేందుకు బ్లాక్ చేసినా..

తక్కువ ఈఎంఐకి లోన్ కావాలా.? క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది తీసుకుంటారా.? డీటీహెచ్ ఆఫర్లు ఉన్నాయి మీకేమైనా కావాలా.? ఇలా ఒకటేమిటి తెల్లారే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల స్పామ్ కాల్స్ ప్రతీరోజూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. వీటి బెడదను తప్పించుకునేందుకు బ్లాక్ చేసినా.. ఎలాంటి లాభం లేకుండా పోయిందా.? ఈ స్పామ్ కాల్స్ టార్చర్ ఆగట్లేదా.? అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఒకసారి ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి. కచ్చితంగా మీకు వీటి నుంచి రిలీఫ్ రావడం పక్కా.. లేట్ ఎందుకు మరి ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..
ప్రతీ రోజూ విసిగిస్తున్న స్పామ్ కాల్స్ బెడదను నివారించేందుకు ఓ మహిళ అద్భుతమైన ట్రిక్ ప్లే చేసింది. దెబ్బకు ఆ ఫోన్లు చేసేవారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ మొబైల్‌కి ఫేక్ నెంబర్ వస్తుంది. అది స్పామ్ కాల్ అని గ్రహించిన మహిళ.. ఆ ఫోన్‌పై ఒక స్టీల్ బౌల్‌ను బోర్లించి.. గరిటెతో దాన్ని పదేపదే బడుతుంది. కచ్చితంగా అవతల ఫోన్ ఎత్తిన వ్యక్తికి ఇది వినగానే చెవులు చిల్లు పడి ఉండొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
Had enough of spam calls ? Try this. True Indian Innovation.. I am gonna do this tomorrow with @Bajaj_Finserv 🤣🤣🤣🤣 pic.twitter.com/tJTRDC0VOo
— Nationalist (@Nationalist2575) August 18, 2023
కాగా, దీనిని ట్విట్టర్‌లో ‘Nationalist2575’ అనే యూజర్ షేర్ చేయగా.. క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటివరకు 5 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించగా.. 8 వేల మంది లైకులు కొట్టారు. అలాగే 1500 మందికి పైగా నెటిజన్లు రీ-పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తంపరిచారు. ‘అవతల వ్యక్తులు కూడా మనుషులేనని.. వారి ఉద్యోగం వల్ల అలా చేయాల్సి వస్తుందని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘సూపర్ ఐడియా సర్ జి’ అంటూ మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.
Please don’t so such things. The people who call you are humans and they are just doing their job. You always have the option of not picking the call or even disconnecting it as soon as you know it is a tele caller. The people who call you, work under tremendous stress including…
— Vishnu (విష్ణు మూర్తి) (@vmurthy77) August 19, 2023
Telecaller be like.. : Yeh Dombas (Ukraine) kaise connect ho gaya.. 💣🧉💣🧉🚀🧑🎤
— Dharma Giri 🇮🇳 (@planetdreams) August 19, 2023