Viral News: ప్లీజ్ మంచినీళ్లివ్వండి.. ఓ ఉడుత ఎంత దీనంగా అడిగిందో చూడండి!!
ఎక్కడెక్కడో జరిగే వింతలు, విశేషాలన్నీ ఇప్పుడు మన అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో క్షణాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, X వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో రోజూ కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని జంతువులు చేసే పనులు మనసుల్ని హత్తుకుంటాయి.మరికొన్ని వీడియోలు గుండెల్ని పిండేస్తుంటాయి. చూడగానే అయ్యోపాపం అని అనిపిస్తుంటుంది. వాటి కష్టం తీరాక.. నిజంగా మన కష్టం తీరినంత సంబరపడిపోతుంటాం. అలాంటిదే ఈ వీడియో కూడా..

ఎక్కడెక్కడో జరిగే వింతలు, విశేషాలన్నీ ఇప్పుడు మన అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో క్షణాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, X వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో రోజూ కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని జంతువులు చేసే పనులు మనసుల్ని హత్తుకుంటాయి.మరికొన్ని వీడియోలు గుండెల్ని పిండేస్తుంటాయి. చూడగానే అయ్యోపాపం అని అనిపిస్తుంటుంది.
వాటి కష్టం తీరాక.. నిజంగా మన కష్టం తీరినంత సంబరపడిపోతుంటాం. అలాంటిదే ఈ వీడియో కూడా. ఈ వీడియోలో ఒక ఉడుత.. పాపం ఎంత దాహంగా ఉందో.. ఆహారం తిని ఎన్ని రోజులైందో గానీ.. రోడ్డుపై వెళ్తున్న వాకర్స్ చేతిలో మంచినీళ్లు చూసింది. దయచేసి మంచినీళ్లివ్వండి అంటూ.. రెండు చేతులతో మొక్కి మరీ అడిగింది.




దాని దీనత్వానికి చలించిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న మంచినీటి బాటిల్ తో దాని దాహాన్ని తీర్చి మానవత్వాన్ని చాటారు. అయితే ఇది మన దేశంలో జరగలేదని ఆ వ్యక్తిని చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోను ఓ ఐఏఎస్ అధికారి సుశాంత్ నంద తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో పోస్ట్ చేసి చాలాకాలమే అయినా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. దీనికి పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మూగజీవాలకు మంచినీళ్లు కూడా దొరకకుండా మనం ఈ భూమిని నాశనం చేసేస్తున్నామని, అయ్యో పాపం దానికి ఎంత దాహంగా ఉందో అంటూ ఈ వీడియోకి రిప్లై ఇస్తున్నారు.
Squirrel asking for water…. pic.twitter.com/JNldkB0aWU
— Susanta Nanda (@susantananda3) July 16, 2020
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి