Viral News: పులిపిల్లల్ని సాకుతోన్న ఒరంగుటాన్.. చూస్తే ఎంత ముచ్చటేస్తుందో!
అప్పుడప్పుడు నెట్టింట కొన్ని వీడియోలు చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కొన్నైతే నమ్మశక్యం కానివిగా కనిపిస్తాయి. మరికొన్ని వావ్ అని అబ్బురపరిచేలా ఉంటాయి. కొన్ని జంతువుల స్నేహాలు, అవి చూపించే ప్రేమ మనల్ని మైమరపించేలా ఉంటాయి. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటిదే. ఒరంగుటాన్ అనే కోతి పులిపిల్లల్ని తన పిల్లల్లా లాలించి, ఆలించడం అస్సలు ఊహించి ఉండరు. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట్ జోరుగా వైరల్..

అప్పుడప్పుడు నెట్టింట కొన్ని వీడియోలు చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కొన్నైతే నమ్మశక్యం కానివిగా కనిపిస్తాయి. మరికొన్ని వావ్ అని అబ్బురపరిచేలా ఉంటాయి. కొన్ని జంతువుల స్నేహాలు, అవి చూపించే ప్రేమ మనల్ని మైమరపించేలా ఉంటాయి. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటిదే. ఒరంగుటాన్ అనే కోతి పులిపిల్లల్ని తన పిల్లల్లా లాలించి, ఆలించడం అస్సలు ఊహించి ఉండరు.
ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట్ జోరుగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ వీడియోకి 31 మిలియన్ల మందికి పైగా వీక్షించగా.. నాలుగున్నర లక్షల మందికిపైగా లైక్ చేశారు. వేల మంది కామెంట్లు, రీ ట్వీట్లు చేశారు. ఈ వీడియోను చూస్తే.. పోంగిడే అనే జాతికి చెందిన మానవకోతి ‘ఒరంగుటాన్’.. మూడు పులి పిల్లల్ని తల్లిలా లాలిస్తోంది. వాటిని ఎత్తుకుని, ఆడిస్తూ.. ముద్దాడుతూ.. పసిపిల్లలకు పాలు పట్టించినట్లు.. పాలు పట్టిస్తూ తన పిల్లల్లాగే సాకుతోంది.




ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారో తెలియదు కానీ.. లక్షల మంది నెటిజన్ల హృదయాలను తాకింది. వీడియో చూసిన నెటిజన్లు.. ప్రేమ ఎంతో విలువైనదని, జంతువుల మధ్య ప్రేమ స్వచ్ఛంగా ఉంటుందని, చూడటానికి చాలా ఆనందంగా ఉందని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ.. రీ ట్వీట్స్ చేస్తున్నారు. నిజంగా పులిపిల్లల్ని ఒక ఒరంగుటాన్ ఇంత అందంగా సాకుతూ.. మాతృత్వాన్ని పంచడం చూస్తుంటే ముచ్చటేస్తుంది కదూ.
this is the cutest video ever pic.twitter.com/ORnnxbiM1B
— why you should have an animal (@shouldhaveanima) August 2, 2023
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
