మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే.. అప్పటి కుందేలు కథ రిపీట్‌ అయింది..

|

Mar 28, 2024 | 1:03 PM

ఒక తాబేలు మొసలి ముందుకు వెళ్ళడానికి ధైర్యం చేసింది. ఇప్పుడు మొసలి ముందు తాబేలు తనంతట తానే వెళ్తుంటే అది మృత్యువు ద్వారం వద్దకు వెళ్లినట్లే. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. తాబేలు మొసలి దగ్గరికి వెళ్ళింది. ఈ తర్వాత జరిగింది చూస్తే మన కళ్లను మనమే నమ్మలేం. మొసలితో తలపడ్డ తాబేలు ఏమైనట్టు..? పూర్తి వివరాల్లోకి వెళితే..

మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే.. అప్పటి కుందేలు కథ రిపీట్‌ అయింది..
Tortoise And Crocodile
Follow us on

మొసలి వీడియో: మీరు సోషల్ మీడియాలో చాలా రకాల జంతువుల వీడియోలు చూస్తుంటాం.. అందులో మొసలి వీడియోలను కూడా చూస్తుంటాం. ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ వీడియోలో మీరు మొసలి వేటను చూస్తారు. దానికి ఎదురుగా వచ్చే ఏ జంతువు, పక్షిని అది మింగేయకుండా వదలడం అసాధ్యం. భారీ శరీరంతో ఉండే ఏనుగులు, పులులు, సింహాలు, చిరుతపులులు వంటి జంతువులు కూడా దాహం తీర్చుకునేందుకు వెళ్లినపుడు మొసళ్లకు భయపడి జాగ్రత్తగా నీరు తాగడం కనిపిస్తుంది. అలాంటి మొసలి ముందు ఓ తాబేలు తడబడకుండా వెళ్లిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక తాబేలు మొసలి ముందుకు వెళ్ళడానికి ధైర్యం చేసింది. ఇప్పుడు మొసలి ముందు తాబేలు తనంతట తానే వెళ్తుంటే అది మృత్యువు ద్వారం వద్దకు వెళ్లినట్లే. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. తాబేలు మొసలి దగ్గరికి వెళ్ళింది. ఈ తర్వాత జరిగింది చూస్తే మన కళ్లను మనమే నమ్మలేం. మొసలితో తలపడ్డ తాబేలు ఏమైనట్టు..? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ వీడియోలో ఓ పెద్ద మొసలి తాబేలును వేటాడేందుకు ప్రయత్నిస్తోంది. కానీ తాబేలు తన ప్రాణాలను కాపాడుకోవడానికి మొసలి బారి నుండి తప్పించుకోగలుగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేటాడుతన్న మొసలికి తాబేలు చిక్కింది. కానీ, ఆ తాబేలు మొసలి నోటిలో ఎక్కువ సేపు ఉండలేకపోయింది. తాబేలు దృఢమైన శరీరంతో మొసలి నోటి నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. మొసలితో ఆ చిన్న జీవి చేసిన జీవన్మరణ యుద్ధంలో తాబేలు గెలిచింది. @AMAZlNGNATURE హ్యాండిల్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 19 లక్షల మందికి పైగా వీక్షించారు. రెండు వేల మందికి పైగా ప్రజలు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇలాంటి వీడియో కనిపించడం ఇదే మొదటిసారి కాదు.. వీడియో చూసిన తర్వాత చాలా మంది యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వైరల్ అవుతున్న వీడియోపై ప్రజలు తమ స్పందనను తెలియజేస్తున్నారు. తాబేళ్లు చాలా తెలివైనవి. మొసలి చాలా సోమరితనం వల్లే ఇక్కడ ఓడిపోయిందంటూ ఒక వినియోగదారు రాశాడు. అదే సమయంలో ఏ పోటీలోనైనా చివరకు తాబేలే గెలుస్తుందంటూ.. చిన్ననాటి తాబేలు, కుందేలు కథను గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…