భూమి మీద నూకలు తినే యోగం ఉంటే.. పాము కూడా తాడవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ మాటకు సజీవ ఉదాహరణగా నిలుస్తుంది ఇటీవల జరిగిన ఓ సంఘటన. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అందులో ఓ బాలిక పై నుంచి కిందకు పడిపోతున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోలో పాప ఎంత ఎత్తు నుంచి కిందపడిందో స్పష్టంగా తెలియనప్పటికీ.. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి చిన్నారి పడిపోయినట్లు చెబుతున్నారు.
అదృష్టవశాత్తూ.. అక్కడ ఒక మోటారుసైకిల్ ఉంది. పై నుంచి చిన్నారి డైరెక్ట్ గా నేలమీద పడలేదు. మోటార్ బైక్ సీటుపై పడింది. బైక్ సీటు మీద నుంచి కిందకు పడడంతో ప్రమాద ప్రభావం చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. చిన్నారికి ఏ మేరకు గాయమైందో తెలియనప్పటికీ.. ఘటన జరిగిన తర్వాత చిన్నారి నేలమీద నుంచి లేచి నిలబడి.. చేతులు దులుపుకుంటూ ఇంట్లోకి వెళ్లిన దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు.
మీరు వీడియోను ఇక్కడ చూడండి
#Maharashtra #News #CCTV #Footage girl fell from 30 feet height on ground was survived miraculously. This incident is of #Washim district of Maharashtra. pic.twitter.com/7xvrxN6g3r
— Mayuresh Ganapatye (@mayuganapatye) April 27, 2023
మహారాష్ట్ర లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వాషిమ్ లోని రిసోడ్ ప్రాంతంలో ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ళ బాలిక ఇంటిలోని గ్యాలరీ దగ్గరకు వచ్చింది. ఆడుకుంటూ గ్రిల్స్ పై నిలబడటంతో బ్యాలన్స్ తప్పి నేరుగా కింద పడిపోయ్యినట్లు తెలుస్తోంది. అయితే ఆ చిన్నారి బాలిక నేరుగా బైక్ సీటు మీద పడటం తో ప్రమాదం తప్పింది. కిందపడగానే లేచి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయంది. ఈ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరల్లో నమోదయ్యాయి. ఈ వీడియో ఇప్పటికే ట్విట్టర్‌లో ఓ రేంజ్ లో వ్యూస్, లైక్స్ ను సొంతం చేసుకుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..