Guinness World Records: గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో 7 ఏళ్ల బాలుడు? ఏం చేశాడో తెలిస్తే అవాక్కవ్వాలసిందే..

|

Mar 04, 2023 | 9:09 PM

స్థానిక లిటిల్ లీగ్ జట్టు తరపున కూడా ఆడే లాథన్.. గొంజాలెస్‌లోని స్టీవెన్స్ పార్క్‌లో బుధవారం నాడు (8 మార్చి) డబుల్-హెడర్‌కు అంపైరింగ్ చేయవలసి ఉంది.

Guinness World Records: గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో 7 ఏళ్ల బాలుడు? ఏం చేశాడో తెలిస్తే అవాక్కవ్వాలసిందే..
Guinness World Record
Follow us on

బేస్‌బాల్ నిబంధనలపై గట్టి పట్టు ఉన్న 7 ఏళ్ల లూసియానా బాలుడు లాథన్ విలియమ్స్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు.

లాథన్ విలియమ్స్, అతని తల్లిదండ్రులు నిర్వహించే సోషల్ మీడియా ఛానెల్‌లలో లాథన్ ది కిడ్ అంపైర్ అని పిలవబడే షోలోనూ అంపైరింగ్ టిప్స్ ఇస్తుంటాడు. లాథన్ విలియమ్స్ 5 సంవత్సరాల వయస్సు నుంచి స్థానిక బేస్ బాల్ గేమ్‌లకు అంపైర్‌గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్ల వయస్సులో ఉన్న ఆటగాళ్లు ఆడే టోర్నీలలోనూ అపైరింగ్‌గా పనిచేస్తున్నాడు.

స్థానిక లిటిల్ లీగ్ జట్టు తరపున కూడా ఆడే లాథన్.. గొంజాలెస్‌లోని స్టీవెన్స్ పార్క్‌లో బుధవారం నాడు (8 మార్చి) డబుల్-హెడర్‌కు అంపైరింగ్ చేయవలసి ఉంది.

ఇవి కూడా చదవండి

APBaseball ద్వారా స్పాన్సర్ చేయబడిన ఈ ఈవెంట్‌లో ప్రపంచంలోని అతి పిన్న వయస్కుడైన బేస్ బాల్ అంపైర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకునేందుకు అధికారిక ప్రయత్నంగా ఉపయోగపడుతుందని లాథన్ విలియమ్స్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..