Thailand Earthquake Video: కొన్ని భవనాలు గాల్లో ఊగిపోయాయి.. కానీ కూలిపోలేదు… తేడా ఎక్కడుంది?
భారీ భూకంపం బెంబేలెత్తించింది. క్షణాల్లో విధ్వంసం సృష్టించింది. పలు దేశాలను అతలాకుతలం చేసేసింది...! ఈ భూప్రళయం ఎఫెక్ట్‌తో మయన్మార్ అల్లకల్లోలమైంది. నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించింది. మొదట 7.7 తీవ్రత, రెండోసారి 6.4 తీవ్రతతో భూమి కంపించడం వల్ల అపార్టుమెంట్లు, ఆఫీసులు, హోటళ్లు, ఆస్పత్రులు పేకమేడలా కూలిపోయాయి. మయన్మార్ ఎయిర్‌పోర్ట్ సైతం షేక్ అయ్యింది. స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ఏం జరుగుతుందో అర్ధంకాని వందలాది మంది ప్రయాణికులు...

భారీ భూకంపం బెంబేలెత్తించింది. క్షణాల్లో విధ్వంసం సృష్టించింది. పలు దేశాలను అతలాకుతలం చేసేసింది…! ఈ భూప్రళయం ఎఫెక్ట్‌తో మయన్మార్ అల్లకల్లోలమైంది. నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించింది. మొదట 7.7 తీవ్రత, రెండోసారి 6.4 తీవ్రతతో భూమి కంపించడం వల్ల అపార్టుమెంట్లు, ఆఫీసులు, హోటళ్లు, ఆస్పత్రులు పేకమేడలా కూలిపోయాయి. మయన్మార్ ఎయిర్‌పోర్ట్ సైతం షేక్ అయ్యింది. స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ఏం జరుగుతుందో అర్ధంకాని వందలాది మంది ప్రయాణికులు… బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు విమానలు కూడా ఊగాయి. అలాగే ఎయిర్‌పోర్టు బయట కార్లు సైతం షేక్ అయ్యాయి. ఏళ్ల చరిత్ర ఉన్న అవా బ్రిడ్జ్ నేలమట్టమైంది. మయన్మార్ క్యాపిటల్ నేపిడాలోని వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది.
థాయ్‌లాండ్‌పై కూడా భూకంప తీవ్రత గట్టిగానే ఉంది. వందలాది బౌద్దరామాలు ధ్వంసమయ్యాయి. 20 నుంచి 30 అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసి… ఎయిర్‌పోర్ట్‌ను లాక్‌డౌన్ చేశారు. అలాగే బ్యాంకాక్‌లో మైట్రో ట్రైన్లు సైతం భూకంప తీవ్రతకు షేక్ అవ్వడంతో బయటకు పరుగులు పెట్టారు ప్యాసింజర్లు, దీంతో ట్రైన్లు, మెట్రో ట్రైన్ల సర్వీసులను క్యాన్సిల్ చేశారు. అలాగే ఇటు చైనా, లావోస్, బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మేఘాలయ, కోల్‌కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు జనాలను వణికించాయి. ఇంఫాల్ ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయాలో భూకంప తీవ్రత 4.0గా నమోదైంది.
బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనంతో సహా కొన్ని భవనాలు కూలిపోగా, మరికొన్ని ఊగిపోయాయి. కానీ కూలిపోకుండా ఆలాగే ఉన్నాయి. ఇంజనీరింగ్, డిజైన్, నిర్మాణ సామగ్రి వంటివి భూకంప షాక్‌లను తట్టుకునేలా భవనం సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయని నిపుణులంటున్నారు. భూకంపాలు భూకంప తరంగాల రూపంలో శక్తిని విడుదల చేస్తాయి, ఇవి భూమిని కదిలించి ఆ కదలికను భవనాలకు బదిలీ చేస్తాయి. దీనివల్ల నిర్మాణాలు ఊగుతాయి, కానీ అలాంటి కదలికను తట్టుకునే సామర్థ్యం ఎత్తు, నిర్మాణంలో పదార్థ కూర్పు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు, ఎత్తైన భవనాలు తరచుగా చిన్న భవనాల కంటే భూకంపాలను బాగా తట్టుకుంటాయి. ఆకాశహర్మ్యాలు మరింత సరళంగా ఉండేలా రూపొందించబడతాయి. అవి కూలిపోకుండా భూకంప శక్తిని తట్టుకునేలా నిర్మిస్తారు. దీనికి విరుద్ధంగా చిన్న భవనాలు దృఢంగా ఉండటం, భూకంపాల సమయంలో ఎక్కువ శక్తిని గ్రహించడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది.
వీడియో చూడండి:
The Bangkok earthquake that hit just now was the first big one in many years, catching everyone by surprise. Its epicenter in Myanmar, 7.7 magnitude. Bangkok’s high-rises are not usually built for quakes.
Tall buildings are like big, wobbly Jenga towers; they lean and sway… pic.twitter.com/Gze2C3Obbl
— LordBenalez (@LordBenalez) March 28, 2025
థాయిలాండ్‌లో భూకంపాన్ని తట్టుకుని ఊగుతున్న భవనాల వీడియోలను X యూజర్ షేర్ చేశాడు. నిర్మాణంలో ఉపయోగించే పదార్థాలు భవనం భూకంప నిరోధకతను నిర్ణయించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉక్కు, కలప వంటి పదార్థాలతో తయారు చేయబడిన నిర్మాణాలు, కాంక్రీటుతో నిర్మాణాల కంటే షాక్‌లను బాగా గ్రహిస్తాయి. ఇంజనీర్లు భూకంప-నిరోధక డిజైన్‌లను కూడా చేర్చారు, ఇవి భవనం అంతటా భూకంప శక్తిని పంపిణీ చేయడంలో సహాయపడతాయి. భూకంపం సంభవించే ప్రాంతాలలో, బేస్ ఐసోలేటర్‌ల వంటి అధునాతన సాంకేతికతను నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. భవనాల బేస్ వద్ద ఉండే ఈ ఐసోలేటర్లు షాక్ అబ్జార్బర్‌లుగా పనిచేస్తాయి, భూమి నుండి నిర్మాణానికి బదిలీ చేయబడిన శక్తిని తగ్గిస్తాయి.
బ్యాంకాక్‌లోని ఎత్తైన భవనాలు ఊగినప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం వాటి డిజైన్ కారణంగా చెక్కుచెదరకుండా ఉన్నాయి, భూకంపం సంభవించినప్పుడు నష్టం తగ్గింపులో ఆధునిక ఇంజనీరింగ్ కీలకమని రుజువు చేస్తుంది.