Elon Mask: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తమ బోర్డులో చేరబోవటం లేదని ట్విటర్ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్(Parag Agarwal) వెల్లడించారు. ఈ మేరకు పరాగ్ తన ట్విటర్ ఖాతాలో కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. బోర్డులో మస్క్ చేరికపై ఆయనతోపాటు తోటి సభ్యులతో(Board Members) తాము చెర్చించినట్లు పేర్కొన్నారు. బోర్డు మెంబర్లు, వాటాదారులు, కంపెనీ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయనకు బోర్డులో సభ్యత్వం ఇవ్వాలని ఆహ్వానించినట్లు చెప్పారు. తమ వాటాదారులు బోర్డులో ఉన్నా.. లేకపోయినా వారి నుంచి సలహాలకు కంపెనీ విలువనిస్తుందని స్పష్టం చేశారు.
కంపెనీలో అతిపెద్ద వాటాదారైన మస్క్ నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని ఈ పోస్ట్ లో వివరించారు. ఈ నెల మెుదటి వారంలో ఎలాన్ మస్క్ ట్వి్ట్టర్ కంపెనీలో 9.2 శాతం వాటాను కొన్నారు. ట్వి్ట్టర్ విధానాలను విమర్శించే మస్క్ తిరిగి అదే కంపెనీలో పెట్టుబడి పెట్టడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు వాక్ స్వేచ్ఛ చాలా కీలకమని.. ట్విటర్ ఈ నియమానికి కట్టుబడి ఉందని మీరు భావిస్తున్నారా అంటూ చేసిన పోల్ కు వచ్చిన రెస్పాన్స్ ఈ పెట్టుబడి వెనుక అసలు కారణంగా తెలుస్తోంది.
దీనికి తోడు ఎడిట్ బటన్ విషయంలో మరో పోల్ నిర్వహించటం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి తోడు.. బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఫీజు తగ్గించడం, ప్రకటనల నిషేధం, క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు వంటి అంశాలు ఆయన సూచించిన వాటిలో ఉన్నాయి. సెలెబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, అధికారిక ఖాతాలు, గుర్తింపు పొందిన వ్యక్తులకు ఇచ్చే ‘వెరిఫికేషన్ మార్క్’తో పోలిస్తే ప్రత్యేకంగా ఉండే ఓ ‘అథెంటికేషన్ చెక్‌మార్క్’ను బ్లూ సబ్‌స్క్రైబర్లకు ఇవ్వాలని సూచించారు. ఫోల్డర్ల బుక్‌మార్క్, అన్‌డూ ట్వీట్, రీడర్ మోడ్ వంటి ఫీచర్లు ప్రస్తుతం బ్లూ సబ్‌స్క్రైబర్లకు లభిస్తున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతానికి ఈ సబ్‌స్క్రిప్షన్ సౌలభ్యం అందుబాటులో ఉంది.
Elon has decided not to join our board. I sent a brief note to the company, sharing with you all here. pic.twitter.com/lfrXACavvk
— Parag Agrawal (@paraga) April 11, 2022
ఇవీ చదవండి..
Startup Companies: స్టార్టప్స్‌లోకి పెట్టుబడుల వెల్లువ.. మూడు నెలల్లోనే ఎన్ని కోట్లు వచ్చాయంటే..
Minister RK Roja: ప్రమాణస్వీకారం వేళ రోజా ఎమోషనల్.. జగన్‌కు పాదాభివందనాలు..