Shower Ceremony Dog: మంగళహారతులు, విందు భోజనాలతో ఇల్లంతా సందడి.. అసలు విషయం తెలిసి అవాక్కైన ఆహ్వానితులు..!

Shower Ceremony: మంగళహారతులు, విందు భోజనాలు.. ఆ ఇంట్లో సందడి నెలకొంది. ఎదో శుభకార్యం జరుగుతుందని అనుకున్నారు అంతా. కానీ అసలు విషయం తెలిసి,

Shower Ceremony Dog: మంగళహారతులు, విందు భోజనాలతో ఇల్లంతా సందడి.. అసలు విషయం తెలిసి అవాక్కైన ఆహ్వానితులు..!
Dog
Follow us

|

Updated on: Dec 07, 2021 | 8:34 AM

Shower Ceremony: మంగళహారతులు, విందు భోజనాలు.. ఆ ఇంట్లో సందడి నెలకొంది. ఎదో శుభకార్యం జరుగుతుందని అనుకున్నారు అంతా. కానీ అసలు విషయం తెలిసి, అవాక్కయ్యారు. ఇంతకీ ఆ శుభకార్యం ఏంటి? అంతలా అవాక్కయ్యేది ఏముంది? ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి సీమంతం జరిగే సమయంలో మహిళలకు ఉండే ఆనందమే వేరు. స్త్రీ మాతృత్వపు మాధుర్యాన్ని పొందే కొద్ది నెలల ముందు జరిగే ఈ వేడుకలో అందరూ వచ్చి పొగుడుతుంటే ఆమె ఆనందం మాటల్లో చెప్పలేం. ఇలాగే తమిళనాడులో ఓ సీమంతం జరిగింది. ఆ ఇంట్లో ఒకటే సందడి. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సీమంతానికి పిలిచారు. వైభవంగా సీమంతం వేడుక జరిపారు ఆ ఇంట్లోవాళ్లు. వాళ్ల వీధిలో అందరికీ విందు ఏర్పాట్లు చేశారు. ఇందులో వింతేముంది అనుకోకండి. సీమంతం చేసింది ఎవరికో తెలిస్తే నోరెళ్లబెడతారు. వారు తమ ఇంట్లో పెంపుడు శునకానికి ఈ సీమంతం నిర్వహించారు.

తమిళనాడు మదురై జిల్లాలో పెంపుడు శునకానికి సీమంతం చేసింది ఆ కుటుంబం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఆ శునకాన్ని సొంత బిడ్డలా చూసుకుంటున్నామని చెబుతోంది ఆ ఫ్యామిలీ. జైహింద్‌పురానికి చెందిన శక్తివేల్ మదురై కార్పొరేషన్‌లో సబ్​ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. సుజీ అనే కుక్కను పెంచుకుంటున్నారాయన. అది ఇటీవల గర్భం దాల్చగా, వైభవంగా సీమంతం చేయాలని నిర్ణయించుకున్నారు​శక్తివేల్. ఇందులో భాగంగా సుజీని పూలమాల వేసి అలంకరించారు. ఐదు రకాల బియ్యంతో వంటలు చేసి తినిపించారు కుటుంబ సభ్యులు. అతిథులందరికీ భోజనాలు పెట్టారు. సీమంతానికి వచ్చిన చుట్టుపక్కల వాళ్లు దానికి కుంకుమ రాసి, గాజులు వేశారు. సుజీకి హారతి ఇచ్చి ఆశీర్వదించారు. సుజీ సీమంతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్​మీడియాలో వైరల్‌గా మారాయి. అది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. పెంపుడు కుక్క పట్ల శక్తివేల్‌ చూపుతున్న ప్రేమకు ఫిదా అయిపోతున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read:

Omicron: ‘సూపర్ మైల్ట్‌’ వేరియంట్‌గా ఒమిక్రాన్.. టార్గెట్‌గా మారిన యువత.. పొంచి ఉన్న భారీ ముప్పు.. నిపుణులు ఏమంటున్నారంటే?

Putin in India: భారత రష్యా సంబంధాలకు బూస్టర్ డోస్ ఇచ్చిన పుతిన్ పర్యటన.. వాణిజ్య బంధాలపై పలు ఒప్పందాలు!

Zoom Call: సర్‌ప్రైజ్‌ ఇస్తాడనుకుంటే.. షాకిచ్చాడు.. మూడు నిమిషాల్లో 900 మంది ఔట్‌!