Chicken in Veg Manchurian: ఇటీవల కొన్ని హోటళ్లలో నిర్వహణా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆర్డర్ చేసిన ఫుడ్‌కు బదులుగా మరో ఫుడ్ సర్వ్ చేయడం.. ఆహారంలో బల్లులు, బొద్దింకలు, పురుగులు రావడం సర్వసాధారణమైపోయింది. కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నా, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా కొన్ని హోటళ్ల యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. అధికారులు దాడులు చేసి జరిమానాలు విధిస్తున్నా వారి పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తమిళ పాటల రచయిత కో శేషాకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు. ఇటీవల ఇష్టపడి ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా గోబీ మంచూరియా విత్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు.
బాగా ఆకలిమీదున్న ఆయన ఫుడ్ రాగానే తినడం ప్రారంభించాడు. కొద్దిగా తిన్న తర్వాత ఏదో తేడా గా అనిపించింది. తనతోపాటు ఉన్న ఇద్దరు నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్‌కు దాన్ని రుచి చూపించాడు. వాళ్లు అది చికెన్ మంచూరియా అని చెప్పడంతో శేషా కంగుతిన్నాడు. వెంటనే ఫుడ్ డెలివరీ యాప్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. తమ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ.. రూ.70 వాపస్ చేస్తామని బదులిచ్చింది. దీంతో శేషాకు కోపం నషాలానికి అంటుంది. ‘పుట్టినప్పటి నుంచి నాన్ వెజ్ అంటే ఏంటో తెలియని తనతో చికెన్ తినిపించారు.. నా మతపరమైన మనోభావాలను కించపరిచారు. పైగా రూ.70 రీఫండ్ చేసి నా మత విశ్వాసాలకు లెక్కకట్టారు. చెత్త సర్వీస్ అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అవసరమనుకుంటే డెలివరీ యాప్‌పై లీగల్‌గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు.
Found pieces of chicken meat in the “Gobi Manchurian with Corn Fried Rice” that i ordered on @Swiggy from the @tbc_india. What’s worse was Swiggy customer care offered me a compensation of Rs. 70 (!!!) for “offending my religious sentiments”. 1/2 pic.twitter.com/4slmyooYWq
— Ko Sesha (@KoSesha) August 17, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..