
మీరు విజ్ఞాన యాత్రలు, విహారయాత్రల కోసం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే దేశ, విదేశాలలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను చూసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు.. అక్కడి పరిస్థితులు, వాతావరణ అంశాలు, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకుని అర్థం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. అంతేకాదు.. మీరు చేసే విహార యాత్రల వల్ల మీకు మాత్రమే కాకుండా మీరు సందర్శించే దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దీని కోసం ప్రపంచంలోని ప్రతి దేశం పర్యాటకుల కోసం తనదైన రీతిలో సిద్ధం చేస్తుంది. అయితే ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ప్రశాంతమైన నిద్ర కోసం ఆహ్వానించే దేశం కూడా ఈ భూమిపై ఒకటి ఉందని మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే..అదేక్కడో పూర్తి వివరాల్లోకి వెళితే…
ఈ కథనం ‘స్లీప్ టూరిజం’ కోసం క్రమంగా ప్రపంచ గమ్యస్థానంగా మారుతున్న స్వీడన్ గురించి వివరిస్తోంది.. ఈ దేశంలో ఒక గ్రామం ఉంది. ఇది నేటి ఆధునిక పట్టణ జీవితానికి దూరంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ ఒక ప్రత్యేకమైన శాంతి, తాజాదనంతో నిండి ఉంటుంది. ఇది అసలైన ద్వీప సమూహాలతో కూడిన అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ద్వీపం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. సౌకర్యాలు పెద్దగా లేని ఈ గ్రామానికి ప్రజలు కేవలం ప్రశాంతమైన నిద్రకోసం మాత్రమే వస్తారంటే మీరు నమ్మగలరా..?
అవును ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు, చల్లని ప్రదేశాలలో ప్రశాంతతను పొందేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మీకు ఎలాంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉండవు. కానీ, ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. సాదాసీదా స్వచ్ఛమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఈ సౌకర్యం వల్ల ఏడాది పొడవునా లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడికి వచ్చే ప్రయాణికులు ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా,…హోటళ్లలో బ్లాక్‌అవుట్ రూమ్‌లు, స్లీప్-ప్లేలిస్ట్ మరియు మొబైల్-ఫ్రీ వెల్‌నెస్ ప్రాంతాలు వంటి సౌకర్యాలు కల్పిస్తారు. తద్వారా ప్రజలు తమలోని టెన్షన్‌ని పూర్తిగా మర్చిపోయి కొత్త ఉత్తేజాన్ని పొందగలరు. ఇదే విషయాన్ని ఇంటర్‌నెట్ వేదికగా చాలా మంది పరిశోధకులు, పర్యాటకులు వెల్లడించారు. స్వీడన్ స్లీప్ టూరిజం ఎంజాయ్ చేసిన చాలా మంది నెటిజన్లు సైతం తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో వృద్ధ తల్లిదండ్రులను వదిలేసిన కలియుగ కుమారులు.. ఏం జరిగిందంటే..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..