Viral Video: వాటే సీన్.. అనంత్ అంబానీ పెళ్లిలో రజినీకాంత్ డ్యాన్స్..
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి తారాలోకం దిగి వచ్చింది. సెలబ్రిటీల సందడితో ముంబై సిటీ మిరుమిట్లు గొలిపింది. సినీ, రాజకీయ, వ్యాపార, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఈ వేడకలో సందడి చేశారు.
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి పెళ్లి సంబరాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ముఖేష్ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి శుక్రవారం రాత్రి వారి ‘శుభ్ వివాహ్’ జరిగింది. భూలోక స్వర్గాన్ని తలపించేలా చేసిన ఏర్పాట్లు అద్దిరిపోయాయి. దేశవిదేశీ ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై ఫోజులిస్తూ కనిపించారు. ప్రపంచ నలుమూలల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార రంగాల అతిరథ మహారథులు తరలిరావడంతో ముంబైలోని జియో వాల్డ్ సెంటర్ కళకళలాడింది.
ఇక పెళ్లికొడుకు అనంత్ అంబానీ బారాత్ వస్తున్న సమయంలో సెలబ్రిటీలు అందరూ కారు ముందర డ్యాన్స్ వేస్తూ కనిపించారు. అందులో జాన్ సీనా, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, విక్కీ కౌశల్, రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్స్ తమ స్టెప్పులతో అదరగొట్టారు. ఆ సమయంలో రజినీ కూడా హుషారుగా స్టెప్పులేశారు. ప్రముఖ బాలీవుడ్ సాంగ్‌కు సింపుల్‌గా డ్యాన్స్ చేసి అదరగొట్టారు. అనంత్ పెళ్లిలో రజనీకాంత్ డ్యాన్సులు వేయడం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.
VIDEO | Actor Rajinikanth (@rajinikanth) dances at the wedding ceremony of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/bgRlk51P7G
— Press Trust of India (@PTI_News) July 12, 2024
అత్యంత అట్టహాసంగా జరగనున్న ఈ వెడ్డింగ్‌కు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు తరలివస్తున్నారు. ప్రత్యేక అతిథులను తీసుకొచ్చేందుకు అంబానీ మూడు ఫాల్కన్ జెట్లను ఏర్పాటు చేశారు. అలాగే పెళ్లికి సంబంధించిన ఈవెంట్ల కోసం 100కు పైగా ప్రైవేట్ విమానాలు ఉపయోగించనున్నారు. మొత్తంగా ఈ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా 1200 మంది అతిథులు హాజరైయ్యారు. ఈరోజు శుభ్ ఆశీర్వాద్‌కు జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథులంతా ఫార్మల్ దుస్తుల్లో రానున్నారు. ఆదివారం రిసెప్షన్ జరగనుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..