Viral Video: కారు ఢీకొట్టినా తగ్గలేదు.. కిందపడ్డా ఫైటింగ్ ఆపలేదు.. ఇదెక్కడ గొడవరా నాయనా అని చుట్టుపక్కలవాళ్లు వారించినా వెనక్కి తగ్గలేదు. చివరికి పోలీసులు ఎంటరవడంతో ఎక్కడివారు అక్కడ పరారయ్యారు. ఈ గొడవకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ రేంజ్‌లో గొడవకు కారణం ఏంటి? ఎందుకలా ఒకరినొకరు తన్నుకున్నారు? ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లోని నడిరోడ‍్డు మీద కొందరు విద్యార్థులు గొడవపడుతున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న కారు ఆ యువకుల్లో ఇద్దరిని ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లో లేచి కారు బానెట్‌మీద పడి కింద పడ్డాడు. అయినా ఫైటింగ్ ఆపలేదు.. కింద పడ్డ యువకుడు పైకి లేచి మరీ గొడవను కంటిన్యూ చేశారు. గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇది చూసి స్థానికులు భయపడిపోయారు. కొందరు ధైర్యం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గొడవను కంట్రోల్ చేయబోతే వారిని సైతం భయబ్రాంతులకు గురి చేశారు. దాంతో బెదిరిపోయిన స్థానికులు వెనక్కి వచ్చేశారు. యువకుల ఘర్షణ గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు పోలీసుల రాకను గమనించిన యువకులు.. అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, కొందరు విద్యార్థులు మాత్రం పోలీసులకు చిక్కారు. దొరికిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇక విద్యార్థులకు భీకర ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రేంజ్‌లో జరిగిన ఈ ఫైటింగ్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Peak Ghaziabad. Disturbing video.
A speeding car gate-crashes a brawl. The brawl didn’t stop though. pic.twitter.com/p3qyBf0DKt
— Piyush Rai (@Benarasiyaa) September 21, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..