Viral Video: శునకంతో సరదాలాడింది.. తృటిలో తప్పించుకుని ఇలా.. వీడియో వైరల్..
జంతువులను సరదాగా ఆటపట్టిస్తుంటాం.. వాటికి కోపం రానంత సేపు పర్వాలేదు. కోపం వచ్చిందా.. మన పని అవుట్.. పెంపుడు జంతువులైతే పర్వాలేదు.. మనవాడేలే అనుకుని విసుగు తెప్పించినా ఒక్కోసారి క్షమించి..
Viral News: జంతువులను సరదాగా ఆటపట్టిస్తుంటాం.. వాటికి కోపం రానంత సేపు పర్వాలేదు. కోపం వచ్చిందా.. మన పని అవుట్.. పెంపుడు జంతువులైతే పర్వాలేదు.. మనవాడేలే అనుకుని విసుగు తెప్పించినా ఒక్కోసారి క్షమించి వదిలేస్తూ ఉంటుంది. అదే బయటివారు ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం రివర్స్ ట్రీట్ మెంట్ ఇవ్వకుండా ఉండవు. ముఖ్యంగా శునకంతో చాలామంది ఆడుతూ ఉంటారు. పెంపుడు జంతువులతో అయితే మరీ ఎక్కువుగా, ప్రేమగా ఆడుకుంటాం. అదే వీధి కుక్కల జోలికి సాధారణంగా వెళ్లం.. వాటికి కోపం తెప్పిస్తే మామూలుగా పరిగెత్తించవు. అందుకే వీధి శునకాలతో జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాని ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క జోలికి వెళ్లి దానికి ఇరిటేషన్ తెప్పిస్తుంది ఓ బాతు.. చాలా సేపు ఓపిక పడుతుంది ఆశునకం.. అయితే శునకం సహనాన్ని బాతు పరీక్షించడంతో ఒక్కసారిగా కోపంతో బాతుపైకి తిరగబడటంతో ఒక్కసారిగా భయంతో పరుగు తీసింది బాతు.. తృటిలో తప్పించుకుని బతికి బయటపడింది. కొంచెం మిస్సైతే మాత్రం బాతుకు నూకలు చెల్లివి.
యానిమల్స్ డూయింగ్ థింగ్స్ పేరిట ఉన్న ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈవీడియో పోస్టు చేయబడింది. పోస్టు చేసినప్పటి నుంచి ఈవీడియోను లక్షలాది మంది వీక్షించగా, వేలాది లైకులు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. బాతుకు అదృష్టం ఉంది.. అందుకే తప్పించుకుందని కొంతమందని, లక్కీ డక్ అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..