Watch: ఏనుగు తొండంలో బీరు పోసినందుకు వ్యక్తి అరెస్టు.. వీడియోపై నెట్టింట రచ్చ రచ్చ..!
అడవి జంతువులకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే, జంగిల్ సఫారీకి వెళ్లిన పర్యాటకులు వీడియోలు కూడా తరచూ మనం చూస్తుంటాం. అడవిలో జంతువుల జీవన విధానం, వాటి వేటను దగ్గరగా చూసేందుకు చాలా మంది పర్యాటకులు వెళ్తుంటారు. అలా వెళ్లిన వారు అక్కడి జంతువులకు ఏదో రకంగా చిరాకు, కోపం తెప్పించే పనులు చేస్తుంటారు. దాంతో వారు కూడా రిస్క్‌లో పడుతుంటారు. సరిగ్గా అలాంటి పనిచేసిన ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణుల అభయారణ్యంలో అతడు ఏనుగు తొండంలో బీరు పోసి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

కెన్యాలోని ఒక స్పానిష్ పర్యాటకుడు వన్యప్రాణుల అభయారణ్యంలో ఏనుగు తొండంలో బీరు పోస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో గత సంవత్సరం లైకిపియా కౌంటీలోని ఓల్ జోగి కన్జర్వెన్సీలో రికార్డ్ చేయబడిందిగా తెలిసింది. కానీ, ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ వినియోగదారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అడవి ఏనుగు తొండంలో బీరు పోసిన స్పానిష్ పర్యాటకుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో సదరు వ్యక్తి ఏనుగు తొండంలో బీరు పోసి ఖడ్గమృగాలకు క్యారెట్లు తినిపిస్తున్నట్లు కనిపించింది. ఇది అస్సలు సరైనది కాదు. ఈ వీడియో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతా నుండి వీడియోను తొలగించాడు. కానీ, అప్పటికే చాలా మంది దానిని షేర్ చేశారు. ఈ విషయం తీవ్రతను అర్థం చేసుకున్న కెన్యా, అడవి జంతువులకు మద్యం పోసినందుకు నిందితుడిపై చర్యలకు సిద్ధపడింది.
ఈ ఏనుగు వీడియోను @skydive_kenya అనే పర్యాటక బృందం షేర్ చేసింది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఆఫ్రికన్ ఏనుగు ముందు బీరు తాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వాసనను పసిగట్టిన ఏనుగు బీరు డబ్బా కోసం తన తొండాన్ని చాపుతుంది. బీరును దూరంగా ఉంచడానికి బదులుగా, ఆ వ్యక్తి దానిని ఏనుగు తొండంలో పోస్తాడు.
వీడియో ఇక్కడ చూడండి..
Spanish tourist in Kenya gives beer to elephant
The incident is being investigated by the Kenya Wildlife Service and the relevant authorities. pic.twitter.com/teut0sYhax
— MustShareNews (@MustShareNews) August 29, 2025
జూలై 29న, వన్యప్రాణుల అభయారణ్యం తన ఫేస్‌బుక్ పేజీలో ఒక యాడ్ షేర్ చేసింది. అందులో ఆల్ జోగిలో సంవత్సరాలుగా నివసిస్తున్న బుప్ అనే ఏనుగుకు బీరు ఇచ్చాడని, అలాంటి చర్యలు ఆమోదయోగ్యం కానివి, ప్రమాదకరమైనవి, సంస్థ విలువలకు విరుద్ధమని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని, జంతువు శ్రేయస్సు, భద్రతను నిర్ధారిస్తామని వారు పేర్కొన్నారు. రక్షిత అటవీ ప్రాంతంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగకూడదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జోగి కన్జర్వెన్సీ అధికారులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి




