Snake Video: సెక్యూరిటీ గార్డుగా మారిన నాగుపాము.. ఇంటి తలుపు పక్కనే నక్కి.. బుసలు కొడుతూ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
పాములు సాధారణంగా అడవుల్లోనే కనిపిస్తాయి. అయితే జనాభా బాగా పెరిగిపోయింది. ఇళ్ల నిర్మాణాల కోసం అడవులు కూడా మాయమైపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక విష సర్పాలు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లు, గుళ్లల్లో కనిపిస్తూ అందరినీ హడలెత్తిస్తున్నాయి.
ప్రపంచంలో సుమారు 2వేల రకాల పాము జాతులున్నాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి అయిన అలాంటి పాములు కొన్ని మాత్రమే ఉన్నాయి. కోబ్రా , క్రైట్ మరియు రస్సెల్స్ వైపర్ మొదలైనవి ప్రమాదకరమైన పాముల జాబితాలో ఉన్నాయి. ఇవి చాలా విషూరితమైనవి. కాటు వేసిన తర్వాత సరైన సమయంలో చికిత్స పొందకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే ఇలాంటి పాములకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే పాములు సాధారణంగా అడవుల్లోనే కనిపిస్తాయి. అయితే జనాభా బాగా పెరిగిపోయింది. ఇళ్ల నిర్మాణాల కోసం అడవులు కూడా మాయమైపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక విష సర్పాలు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లు, గుళ్లల్లో కనిపిస్తూ అందరినీ హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాముకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
సెక్యూరిటీ గార్డులా..
ఇందులో ఒక పాము ఇంట్లోకి దూరింది. దూరడమే కాదు.. తలుపు దగ్గర ఉన్న రంధ్రంలోకి చేరి పడగ విప్పింది. ఇంట్లో వాళ్లను బయటకు వెళ్లనివ్వకుండా, బయటివాళ్లను ఇంట్లోకి రానివ్వకుండా సెక్యూరిటీ గార్డులా మారిపోయి బుసలు కొడుతూ భయపెట్టింది. దానిని అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడికి దిగింది. ఓ వ్యక్తి పామును వీడియో తీసేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా దాడికి యత్నించింది. అయితే అదృష్టం బాగుండి త్రుటిలో అతను తప్పించుకున్నాడు. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ @TheFigen_ అనే IDతో ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘అత్యంత సురక్షితమైన భద్రతా వ్యవస్థ’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ 15 సెకన్ల వీడియోకు లక్షలాది వ్యూస్, వేలాది లైకులు, కామెంట్లు, షేర్లు వస్తున్నాయి. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ఈ ఇల్లు అత్యంత సురక్షితమైనది’, ‘ఇంటికి హై సెక్యూరిటీ ఇస్తోంది పాము’, ‘డోర్ దగ్గర ఇంత బందోబస్తు నేను ఎప్పుడూ చూడలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
The safest security system! ? pic.twitter.com/QwSesTD7HE
— Figen (@TheFigen_) December 26, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..