Snake: గుట్టుగా వచ్చి గుడ్లను గుటకాయ స్వాహా చేయాలనుకున్న పాము.. చివరకు కథ అడ్డం తిరగడంతో..

| Edited By: Ravi Kiran

Oct 06, 2022 | 11:01 AM

పాములు ఆహారంగా కోళ్లు, పక్షుల గుడ్లను తింటుంటాయి. కొన్ని పాములైతే ఏకంగా తాను పెట్టిన గుడ్లనే మింగేస్తుంటాయి. ఈ వీడియోలో కూడా ఒక పాము తన కడుపు నింపుకోవడానికి  కోడి గుడ్లను మింగేందుకు ప్రయత్నిస్తుంది.

Snake: గుట్టుగా వచ్చి గుడ్లను గుటకాయ స్వాహా చేయాలనుకున్న పాము.. చివరకు కథ అడ్డం తిరగడంతో..
Snake
Follow us on

ఇటీవల పాములకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో కొన్ని భయానకంగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగానూ ఉంటున్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా పాములు ఆహారంగా కోళ్లు, పక్షుల గుడ్లను తింటుంటాయి. కొన్ని పాములైతే ఏకంగా తాను పెట్టిన గుడ్లనే మింగేస్తుంటాయి. ఈ వీడియోలో కూడా ఒక పాము తన కడుపు నింపుకోవడానికి  కోడి గుడ్లను మింగేందుకు ప్రయత్నిస్తుంది. కానీ కథ అడ్డం తిరిగింది. గుడ్లు మరీ భారీగా ఉండడంతో వాటిని నోటిలోకి పెట్టుకున్న పాము మింగలేకపోతుంది. దీంతో చివరకు చేసేదేమి లేక వాటిని కక్కేస్తుంది. చివరకు యథా స్థానంలోనే కోడిగుడ్లను ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

videozaman1 అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేసిన ఈ వైరల్‌ వీడియోలో పాము తన ప్రాణాలు కాపడుకోవడానికే మింగిన గుడ్లను కక్కేస్తుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు చాలా ఆశ్చర్యపోతున్నారు. పాముకిది మిషన్‌ ఇంపాజిబుల్‌ లా తయారైందంటూ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవల వరంగల్‌ జిల్లా ఏటూరునాగారంలో కూడా అచ్చం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇంట్లో ఉట్టిపై వరిగడ్డి వేసి పొదుగు కోసం ఏర్పాటుచేసిన కోడి గుడ్లను ఓ తాచు పాము మింగేసింది. ఇంటి యజమాని గమనించడంతో బుసలు కొడుతూ అతనిపైకి వచ్చింది పాము. చివరకు స్నేక్‌ క్యాచర్‌ వచ్చి ఆ పామును పట్టి తీసుకెళ్లాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..