ఇదేందయ్యా ఇది.. డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే వచ్చింది ఇదా..! వైరల్ వీడియో..

ఇదేందయ్యా ఇది.. డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే వచ్చింది ఇదా..! వైరల్ వీడియో..

Phani CH

|

Updated on: Oct 06, 2022 | 9:41 AM

ప్రస్తుత ఫెస్టివల్ సీజన్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ అన్నీ పోటాపోటీగా ఆఫర్లు ఇస్తున్నాయి. కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.

ప్రస్తుత ఫెస్టివల్ సీజన్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ అన్నీ పోటాపోటీగా ఆఫర్లు ఇస్తున్నాయి. కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఇదే మంచి ఛాన్స్ అని తమకు నచ్చిన ప్రొడక్ట్స్ కొనేస్తున్నారు. అలా బీహార్‌లోని నలంద ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త చేతన్ కుమార్ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ మీషోలో డ్రోన్ కెమెరా ఆర్డర్ చేశాడు. కానీ తనకు వచ్చిన డెలివరీ బాక్సులో ఉన్న వస్తువును చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే డెలివరీ బాయ్ అతడికి ఒక కిలో బంగాళదుంపలను డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు సదరు కంపెనీపై ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై మీషో ఇంకా స్పందించలేదు. గతంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ ఆర్డర్ చేయగా, అతనికి సబ్బులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరలయింది. ప్రస్తుతం డ్రోన్ కెమెరాకు బదులుగా ఆలుగడ్డలు ప్యాక్ చేసి వచ్చిన వీడియో వైరలవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. వింత ఆకృతితో పుట్టిన తాబేలు.. విస్తుపోతున్న జనం!

అర్ధరాత్రి ఇళ్లపై తిరుగుతున్న దెయ్యం.. హడలిపోతున్న జనం !!

మమ్మీ నన్ను రోజూ కొడుతోంది.. టీచర్ వద్ద కన్నీటిపర్యంతమైన చిన్నారి

చెల్లిని గ‌ర్భవ‌తి చేసిన అన్న.. విషయం తెలియడంతో..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి గాడిద పాలు అమ్ముకుంటున్న యువకుడు

 

Published on: Oct 06, 2022 09:41 AM