మమ్మీ నన్ను రోజూ కొడుతోంది.. టీచర్ వద్ద కన్నీటిపర్యంతమైన చిన్నారి
చిన్న పిల్లల మనస్సు చాలా తేలికైనది. ఏదీ దాచుకోలేరు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చేప్పేస్తారు. వారు చేసే చిన్నచిన్న పనులు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు వారి అమాయకత్వం అయ్యో పాపం అనిపిస్తుంది.
చిన్న పిల్లల మనస్సు చాలా తేలికైనది. ఏదీ దాచుకోలేరు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చేప్పేస్తారు. వారు చేసే చిన్నచిన్న పనులు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సార్లు వారి అమాయకత్వం అయ్యో పాపం అనిపిస్తుంది. వారు ఎక్కువ సమయంలో స్కూళ్లలోనే గడుపుతుంటారు. దీంతో వారికి టీచర్లతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. రోజూ స్కూల్ కు వెళ్లడం, టీచర్ ఇచ్చిన హోమ్ వర్క్ చేయడం ఇలా వారి షెడ్యూల్ బిజీ బిజీగా గడిచిపోతుంది. అయితే కొంత మంది వర్క్ పూర్తి చేస్తే.. మరికొందరు మాత్రం మర్చిపోతుంటారు. తర్వాతి రోజు టీచర్ హోమ్ వర్క్ అడిగితే వారికి వింత వింత సమాధానాలు చెప్తుంటారు. టీచర్లను కూల్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఏడిస్తే.. మరి కొందరు మాత్రం నవ్వుతూ ఫిదా చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లాసు రూమ్‌లో ఓ చిన్నారి ఏడుస్తూ టీచర్ కంటపడింది. ఆమెను టీచర్ చేరదీసి.. ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించింది. దానికి ఆ బాలిక తన మమ్మీ రోజూ కొడుతోందని, పరిగెత్తించి మరీ దారుణంగా కొట్టిందని కన్నీటిపర్యంతమైంది. ఈ బుజ్జి బుజ్జి మాటలతో టీచర్‌కు ఫిర్యాదు చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ అయింది. పిల్లల క్యూట్‌నెస్ నా హృదయాన్ని గెలుచుకుందని తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెల్లిని గర్భవతి చేసిన అన్న.. విషయం తెలియడంతో..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి గాడిద పాలు అమ్ముకుంటున్న యువకుడు
జుట్టు ముడవడమే ఆమె తప్పైంది.. కాల్చి చంపిన పోలీసులు !!
రైలు ఎక్కబోయి పడ్డ ప్రయాణీకుడు.. సెకనులో కాపాడిన ఆర్‌పీఎఫ్
చిన్నారుల భేల్‌పురి తయారీ .. నెట్టింట తెగ వైరల్