రైలు ఎక్కబోయి పడ్డ ప్రయాణీకుడు.. సెకనులో కాపాడిన ఆర్‌పీఎఫ్
ఫ్లాట్‌ఫాం, కదులుతున్న రైలు మధ్య చిక్కుకుపోయిన ప్రయాణీకుడిని ఆర్‌పీఎఫ్ సిబ్బంది కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోయంబత్తూర్‌లో ఈ ఘటన జరిగింది.
ఫ్లాట్‌ఫాం, కదులుతున్న రైలు మధ్య చిక్కుకుపోయిన ప్రయాణీకుడిని ఆర్‌పీఎఫ్ సిబ్బంది కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోయంబత్తూర్‌లో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఫుటేజ్‌కు చెందిన ఆ క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాం నుంచి కదులుతున్న రైలు కిందకు పడిపోతున్న వ్యక్తిని ఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అరుణ్‌జిత్, లేడీ హెడ్ కానిస్టేబుల్ పీపీ మిని కాపాడి ఫ్లాట్‌ఫాం పైకి తీసుకువచ్చారు. ట్రైన్ కంపార్ట్‌మెంట్, ఫ్లాట్‌ఫాం మధ్య గ్యాప్‌లో ప్రయాణీకుడు ఇరుక్కుపోవడం ఈ వీడియోలో కనిపించింది. అతి కష్టం మీద ఆర్‌పీఎఫ్ సిబ్బంది రైలు ఎక్కేందుకు ప్రయత్నించి పడిపోయిన ప్రయాణీకుడిని కాపాడారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణీకుడిని కాపాడిన ఆర్‌పీఎఫ్ సిబ్బందిని నెటిజన్లు ప్రశంసించారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది ధైర్యం సమయస్ఫూర్తిని యూజర్లు అభినందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారుల భేల్‌పురి తయారీ .. నెట్టింట తెగ వైరల్
అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. పరీక్ష చేసి డాక్టర్లు షాక్.. అతని పొట్టలో
ఈ మహిళ ఆలోచన నెవ్వెర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. ఉద్యోగం కోసం అప్లై చేస్తూ..??
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

