అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. పరీక్ష చేసి డాక్టర్లు షాక్‌.. అతని పొట్టలో

అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. పరీక్ష చేసి డాక్టర్లు షాక్‌.. అతని పొట్టలో

Phani CH

|

Updated on: Oct 06, 2022 | 9:23 AM

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి డ్రగ్స్‌కు బాగా అడిక్ట్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని సాధారణ మనిషిని చేయలేకపోయారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి డ్రగ్స్‌కు బాగా అడిక్ట్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని సాధారణ మనిషిని చేయలేకపోయారు. దీంతో అతడిని షామ్‌లీలోని డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్​లో జాయిన్ చేశారు. అక్కడ దాదాపు నెలన్నర పాటు విజయ్‌కి చికిత్స అందించారు. అక్కడ ఉండగానే విజయ్‌కి ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది. దాంతో హుటాహుటిన అతడిని ముజఫర్​నగర్​లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్ తరలించారు. విజయ్‌కు టెస్టులు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు. అతడి కడుపులో భారీ సంఖ్యలో స్పూన్లు ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి.. బాధితుడి కడుపు నుంచి ఏకంగా 63 స్పూన్లు వెలికితీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త సీరియస్‌గానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ స్పూన్లు అతని కడుపులోకి ఎలా వచ్చాయని డాక్టర్లు వివరాలు సేకరిస్తున్నారు. అయితే సదరు వ్యక్తి ఈ విషయంపై స్పందించడం లేదు. డ్రగ్​ డీఅడిక్షన్ సెంటర్​ సిబ్బందే విజయ్​కి బలవంతంగా స్పూన్లు తినిపించారని అతని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ మహిళ ఆలోచన నెవ్వెర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌.. ఉద్యోగం కోసం అప్లై చేస్తూ..??

Published on: Oct 06, 2022 09:23 AM