ఈ మహిళ ఆలోచన నెవ్వెర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. ఉద్యోగం కోసం అప్లై చేస్తూ..??
చాలామంది మంచి ఉద్యోగాలు సాధించేందుకు తమ రెజ్యూమ్‌లను సరికొత్తగా తయారు చేస్తుంటారు. ఈ కోవలోనే ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. తనకు వచ్చిన ఆలోచన ఆచరణలో పెట్టింది.
చాలామంది మంచి ఉద్యోగాలు సాధించేందుకు తమ రెజ్యూమ్‌లను సరికొత్తగా తయారు చేస్తుంటారు. ఈ కోవలోనే ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. తనకు వచ్చిన ఆలోచన ఆచరణలో పెట్టింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని నార్త్ కరోలీనాకు చెందిన కార్లీ పావ్‌లినాక్ బ్లాక్‌బర్న్ అనే మహిళ తన రెజ్యూమ్‌ను సరికొత్తగా తయారు చేసింది. ప్రముఖ కంపెనీ ‘నైక్’లో ఉద్యోగం సంపాదించేందుకు వినూత్నంగా తన రెజ్యూమ్‌ను కేక్‌పైన రాయించింది. అనంతరం ఆ కేక్‌ను ‘నైక్’ సంస్థకు పంపించింది. తాను ఎందుకు అలా కేక్‌పై ప్రింట్ చేసిన రెజ్యూమ్‌ను ‘నైక్’ సంస్థకు పంపించిందో.. లింక్దిన్ (Linkedin) పోస్ట్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది. జస్ట్ డూ ఇట్ డే(JDI Day) కోసం నైక్ సంస్థ భారీ వేడుకను జరుపుకుంది. లేబ్రోన్ జేమ్స్, కొలిన్ కేపెర్నిక్, ఇతర ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. అలాంటి పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని.. తన తాను వినూత్నంగా నైక్ సంస్థకు తెలియజేయాలనుకున్నానని.. అందుకే ఇలా చేశానని కార్లీ చెప్పుకొచ్చింది. కాగా, కార్లీ ఆలోచన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెను మెచ్చుకోగా.. మరికొందరు విమర్శించారు. ఒక నెటిజన్ ఆమెది ఇంటరెస్టింగ్ యాక్ట్ అంటూ కామెంట్ చేయగా.. ఇది కేవలం జిమ్మిక్ మాత్రమేనని మరొకరు రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి విందులో వింత కండిషన్.. డిన్నర్ చేయాలంటే అది చూపించాలంటూ !!
ఆకాశంలో రెండు విమానాల క్రాష్ లైవ్‌లో చూశారా.. వీడియో వైరల్
పాములు గుడ్లు కాదు పిల్లలు కూడా పెడతాయి.. నమ్మట్లేదా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

