పెళ్లి విందులో వింత కండిషన్.. డిన్నర్ చేయాలంటే అది చూపించాలంటూ !!
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే వేదికపై పెళ్లి చెసుకున్నారు. ఈ వివాహ వేడుకకు భారీగా అతిథులు హాజరయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే వేదికపై పెళ్లి చెసుకున్నారు. ఈ వివాహ వేడుకకు భారీగా అతిథులు హాజరయ్యారు. అయితే డిన్నర్ చేసే సమయానికి అతిధులకు షాక్ ఇచ్చారు పెళ్లికూతురు ఫ్యామిలీకి సంబంధించిన వారు. విందు ఆరగించాలంటే.. తప్పని సరిగా ఆధార్ కార్డులను చూపించాలని కండిషన్ పెట్టారు. దీనికి కూడా ఓ రీజన్ చెప్పారు.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. వివాహానికి అతిథులు భారీ సంఖ్యలో హాజరుకావడాన్ని చూసిన పెళ్లి కూతురు ఫ్యామిలీ సభ్యులు భయపడ్డారు. ఎందుకంటే.. తాము అతిధుల కోసం ఏర్పాటు చేసిన ఆహారపదార్ధాలు సరిపోతాయాలేదా అని ఆలోచించారు. పెళ్ళికి వచ్చినవారిలో చాలా మంది అపరిచితులుగా కనిపించారు. దీంతో అతిథులను భోజన ప్రదేశంలోకి అనుమతించే ముందు వారి ఆధార్ కార్డులను చూపించమని అడగాలని నిర్ణయించుకున్నారు. ఆధార్ కార్డు లేకుండా వచ్చిన చాలా మంది నిజమైన అతిథులు దీనిని అవమానంగా భావించి భోజనం చేయకుండా వేదిక నుండి బయలుదేరగా, ఆధార్ కార్డులు ఉన్న మరికొందరు లోపలికి వెళ్లి భోజనం చేశారు. కొందరు అతిథులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు. అతిథులను అలా అవమానించడం సరికాదంటూ మండిపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశంలో రెండు విమానాల క్రాష్ లైవ్‌లో చూశారా.. వీడియో వైరల్
పాములు గుడ్లు కాదు పిల్లలు కూడా పెడతాయి.. నమ్మట్లేదా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే
బాబోయ్ ఇదెక్కడి పెయింటింగ్ రా బాబు.. షాకింగ్ వీడియో
పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించనేలేదు !! ఏపనైనా ఒంటి చేత్తోనే
కారు తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.80 లక్షలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

