కారు తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.80 లక్షలు
మీరు కారులో అర్జంట్ పనిమీద వెళ్తుండగా మీ కారు ట్రబుల్ ఇచ్చిందా.. అయితే బాధపడకండి.. ఏమో మీ కారు మీకు ఏ అదృష్టం తెచ్చిపెట్టబోతుందో...
మీరు కారులో అర్జంట్ పనిమీద వెళ్తుండగా మీ కారు ట్రబుల్ ఇచ్చిందా.. అయితే బాధపడకండి.. ఏమో మీ కారు మీకు ఏ అదృష్టం తెచ్చిపెట్టబోతుందో… ఒక్కోసారి మనకు ఎదురయ్యే ఇబ్బందులు కూడా మనకు మంచి చేస్తాయి. దాన్నే అదృష్టం అంటారు. ఈ అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేమండీ… ఇదిగో ఈ సంఘటన చూస్తే మీరు అలాగే అంటారు.. అవును.. అమెరికాలోని మిస్సోరికి చెందిన ఓ వ్యక్తి ఏదో పనిమీద బయటికి వెళ్లాడు. అలా వెళ్తుండగా మధ్యలో కారు ట్రబుల్ ఇచ్చింది. కారు విపరీతంగా వేడెక్కిపోయింది. దాంతో కాసేపు ఆగుదామని డొనిఫాన్ ప్రాంతంలోని కాసీస్ జనరల్ స్టోర్ వద్ద ఆగాడు. కూల్ డ్రింక్ తాగి కాసేపు టైంపాస్ చేశాడు. ఈ క్రమంలో అక్కడ అతనికి లాటరీ టికెట్లు కనబడ్డాయి. ఏమీ తోచక ఓ టికెట్ ట్రై చేద్దామనుకున్నాడు. అంతే.. లాటరీ టికెట్ల దగ్గరికి వెళ్లి ‘ఐదు సెంట్లు’ అంటే సుమారు నాలుగు రూపాయలు పెట్టి ‘మిస్సోరీ స్టేట్ లాటరీ’ స్క్రాచ్ కార్డ్ టికెట్ ను కొన్నారు. ఆ టికెట్‌ను స్క్రాచ్ చేసి టికెట్ బుకింగ్ క్లర్క్‌కు ఇచ్చి ఆ నంబర్‌కు ఏదైనా లాటరీ ఉందేమో చూడమని చెప్పాడు. ఆ మహిళా క్లర్క్ ఆ నెంబర్‌ను స్కాన్ చేసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే.. ఈ స్క్రాచ్ కార్డు నంబర్ కు ఏకంగా లక్ష డాలర్లు అంటే 80 లక్షల పైనే బహుమతి ఉంది. విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి ‘‘నా కారు ఇబ్బంది పెట్టినా.. ఎందుకో ఈ రోజు నాకు కలిసొస్తుందని ముందే అనుకున్నా..” అంటూ తెగ ఆనందపడిపోయాడు. పలు కారణాల రిత్యా సదరు లాటరీ విజేత తన పేరును ప్రచురించడానికి ఇష్టపడలేదు. అయితే అతను ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తనకు అంత అదృష్టాన్ని తెచ్చిపెట్టిన కారును అమ్మేసి కొత్త కారు కొనుక్కుంటానని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంటి చూపుతో పామును కంట్రోల్ చేస్తున్న యువకుడు.. యువకుడి కళ్లలోకి చూస్తూ కింగ్ కోబ్రా డాన్స్
ఈ పెద్దాయన డబ్బుని ఎలా లెక్కిస్తున్నాడో చూశారా.. ఎమోషనల్ వీడియో
దొంగలుగా పొరపాటు పడి.. పరుగో పరుగు !! వైరల్ వీడియో
ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్‌కు చుక్కలు చూపించిన శునకం
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!

