కంటి చూపుతో పామును కంట్రోల్ చేస్తున్న యువకుడు.. యువకుడి కళ్లలోకి చూస్తూ కింగ్ కోబ్రా డాన్స్
పాములంటే చాలా మందికి భయం. అలాంటిది కింగ్ కోబ్రా లాంటి ప్రమాదకర పాములను చూస్తే ఇంకేమైనా ఉందా… అట్నుంచి అటే జంప్.. కానీ ఇక్కడ ఓ యువకుడు కింగ్ కోబ్రాను ఓ ఆటాడుకున్నాడు. ఇది చూసిన ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక యువకుడు కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ నాగుపాము చాలా పెద్దగా, ప్రమాదకరంగా కనిపిస్తుంది. పక్కనే ఇద్దరు పిల్లలు నిలబడి […]
పాములంటే చాలా మందికి భయం. అలాంటిది కింగ్ కోబ్రా లాంటి ప్రమాదకర పాములను చూస్తే ఇంకేమైనా ఉందా… అట్నుంచి అటే జంప్.. కానీ ఇక్కడ ఓ యువకుడు కింగ్ కోబ్రాను ఓ ఆటాడుకున్నాడు. ఇది చూసిన ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక యువకుడు కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ నాగుపాము చాలా పెద్దగా, ప్రమాదకరంగా కనిపిస్తుంది. పక్కనే ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడు నాగుపామును చేతిలో పెట్టుకుని దాని కళ్లలోకిచూస్తున్నాడు. పాముకూడా అతని కళ్లలోకి చూస్తూ ఆడుతుంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. చూస్తుంటే ఆ కోబ్రా బాలుడ్ని కాటు వేస్తుందేమో అనిపిస్తుంది. కానీ అది ఆ బాలుడికి ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఆ బాలుడు ఏ మాత్రం భయపడకుండా మళ్లీ మళ్లీ దాంతో డ్యాన్స్ చేయించాడు. ఈ షాకింగ్ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ అబ్బాయి ఏం నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు? అంటూ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఆటలు ప్రమాదకరమని హచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పెద్దాయన డబ్బుని ఎలా లెక్కిస్తున్నాడో చూశారా.. ఎమోషనల్ వీడియో
దొంగలుగా పొరపాటు పడి.. పరుగో పరుగు !! వైరల్ వీడియో
ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్‌కు చుక్కలు చూపించిన శునకం
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

