ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్‌కు చుక్కలు చూపించిన శునకం
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది పెంచుకునే జంతువుల్లో ఒకటి శునకం. కుక్కలను పెంచుకునే వారు వాటిని పెంపుడు జంతువులుగా కాకుండా కుటుంబసభ్యులుగా చూసుకుంటారు.
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది పెంచుకునే జంతువుల్లో ఒకటి శునకం. కుక్కలను పెంచుకునే వారు వాటిని పెంపుడు జంతువులుగా కాకుండా కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. అవి కూడా తమ యాజమాని పట్ల అంతే విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటాయి. కాగా, కుక్కలు చేసే చిలిపి పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా కుక్క కాటుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కుక్కకు సంబంధించిన చాలా ఫన్నీ వీడియో చూసి మీరు పగలబడి నవ్వుతారు. ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన వెటర్నరీ డాక్టర్‌కు చుక్కలు చూపించింది ఓ కుక్క. ఇద్దరు దంపతులు తమ పెంపుడు కుక్కను గట్టిగా పట్టుకున్నారు. వెటర్నరీ డాక్టర్ ఆ కుక్కకు కనిపించకుండా వెనుక నుండి ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ చేసిన వెంటనే వేగంగా ఇంటి నుండి బయటకు పరిగెత్తాడు. తరువాత ఇంటి గేటును మూసి వేసి చటుక్కున తన కారులోకి దూరిపోయాడు. అయితే ఆ వ్యక్తి పట్టుబడి ఉంటే.. అసలు సినిమా కనిపించేదీ. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియోలో కనిపిస్తున్న కుక్క పిట్ బుల్ జాతికి చెందింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్కలలో ఒకటి. ఈ వీడియో చూసిన జనం వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి జనాలు నవ్వుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tirumala Srivari Brahmotsavam 2022: బ్రహ్మాండనాయకుడి రథోత్సవం.. లైవ్ వీడియో
News Watch: దసరా నాడేపెద్ద కుట్ర.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

