పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించనేలేదు !! ఏపనైనా ఒంటి చేత్తోనే

మనం అప్పుడప్పుడూ చేతులు పైకి ఎత్తుతూ ఉంటాం. అలా కాసేపు అలా గాల్లోనే ఉంచుతాం. ఆ తర్వాత కిందకి దించేస్తాం. కానీ ఏళ్ల తరబడి ఎత్తిన చేతిన దించకుండా ఉన్నాడు.

పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించనేలేదు !! ఏపనైనా ఒంటి చేత్తోనే

|

Updated on: Oct 04, 2022 | 9:27 AM

మనం అప్పుడప్పుడూ చేతులు పైకి ఎత్తుతూ ఉంటాం. అలా కాసేపు అలా గాల్లోనే ఉంచుతాం. ఆ తర్వాత కిందకి దించేస్తాం. కానీ ఏళ్ల తరబడి ఎత్తిన చేతిన దించకుండా ఉన్నాడు. నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇది నిజం. 70 ఏళ్ల సాధువు అమర్‌ భర్తీ.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేయిని పైకే ఎత్తి ఉంచినట్లు అప్పట్లో తెగవైరల్‌గా మారింది. తొలి రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదట. అయితే క్రమంగా తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పిలేదని సాధువు అమర్‌ భర్తీ వెల్లడించారు. మరోవైపు.. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవటం వల్లే ఎలాంటి నొప్పి కలగటం లేదని, ఇకపై ఆ చేయిని కిందకు దించలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు. 1973 వరకు అమర్‌ భర్తీ ఒక సాధారణ వ్యక్తే. అందరిలా వివాహం చేసుకుని పిల్లాపాలతో జీవించేవారు. ఆ తర్వాత తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలని నిశ్చయించుకుని సాధువుగా మారారు. తనలోని శివుడిపట్ల ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచటం మొదలు పెట్టారు. భర్తీ అంశం 2020లోనే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే భర్తీ లాగే మరో వ్యక్తి చేయిని పైకి ఎత్తి ఉంచుతుండటం వెలుగులోకి వచ్చింది. అమర్‌ భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేయలేకపోయినా.. తనకు సాధ్యమైనంత వరకు చేయిని పైకి ఎత్తే ఉంచుతానని చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా చేతిని పైకి ఎత్తే ఉంచానని అతను తెలిపాడు. ఓ రిపోర్టర్‌ సాధువుతో మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్ని రోజుల పాటు ఇలా చేతిని పైకి ఎత్తి ఉంచుతారని విలేకరి ప్రశ్నించగా.. ఇంతకాలం అని ఏమీ అనుకోలేదని చెప్పాడు. అయితే చేయిని పైకి ఉంచే నిద్రపోతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.80 లక్షలు

కంటి చూపుతో పామును కంట్రోల్ చేస్తున్న యువకుడు.. యువకుడి కళ్లలోకి చూస్తూ కింగ్‌ కోబ్రా డాన్స్‌

ఈ పెద్దాయన డబ్బుని ఎలా లెక్కిస్తున్నాడో చూశారా.. ఎమోషనల్‌ వీడియో

దొంగలుగా పొరపాటు పడి.. పరుగో పరుగు !! వైరల్‌ వీడియో

ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్‌కు చుక్కలు చూపించిన శునకం

Follow us
Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?