ఆకాశంలో రెండు విమానాల క్రాష్ లైవ్‌లో చూశారా.. వీడియో వైరల్
రెండు విమానాలు ఢీ కొనడం ఎప్పుడైనా లైవ్‌లో చూశారా.. అయితే ఇక్కడ చూడండి.. విమాన ప్రమాదాల ఘటనలు తరచూ వింటూనే ఉంటాం. ఇటీవల అమెరికాలో ఒక విమానంలో మంటలు చెలరేగడం, ఆ తరువాత ఫ్రాన్స్ విమానం రన్‌వే నుంచి జారి..
రెండు విమానాలు ఢీ కొనడం ఎప్పుడైనా లైవ్‌లో చూశారా.. అయితే ఇక్కడ చూడండి.. విమాన ప్రమాదాల ఘటనలు తరచూ వింటూనే ఉంటాం. ఇటీవల అమెరికాలో ఒక విమానంలో మంటలు చెలరేగడం, ఆ తరువాత ఫ్రాన్స్ విమానం రన్‌వే నుంచి జారి.. సరస్సులో పడిపోవడం లాంటి వార్తలు విన్నాం. తాజాగా జర్మనీలోని లెమనీజ్ ఎయిర్ ఫీల్డ్ ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. రెండు విమానాలు ఒకదానికొకటి ఢీ కొని.. జనావాసాల్లో కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. రెండు విమానాలు కాలి బూడిదయ్యాయి. రెండు విమానాల పైలట్లు ఓ ప్రత్యేక విధానంలో ట్రైనింగ్ అవుతుండగా ఈ క్రాష్ జరిగింది. ఇద్దరు పైలట్లు మిరర్ ఫ్రైట్ కోసం శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా రెండు విమానాలు సమాంతరంగా ఎగురుతున్నాయి. ఈలోగా ఒకదానికొకటి ఢీకొని క్రాష్ అయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. ఇద్దరు పైలట్లు మరణించారు. ఈ దుర్ఘటన అంతా దూరం నుంచి ఓ కెమేరాలో రికార్డైంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాములు గుడ్లు కాదు పిల్లలు కూడా పెడతాయి.. నమ్మట్లేదా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే
బాబోయ్ ఇదెక్కడి పెయింటింగ్ రా బాబు.. షాకింగ్ వీడియో
పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించనేలేదు !! ఏపనైనా ఒంటి చేత్తోనే
కారు తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.80 లక్షలు
కంటి చూపుతో పామును కంట్రోల్ చేస్తున్న యువకుడు.. యువకుడి కళ్లలోకి చూస్తూ కింగ్ కోబ్రా డాన్స్
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

