Snake Viral Video: తలపై నాగమణితో ఊళ్లోకి వచ్చిన నాగుపాము.. దగ్గరకు వెళ్లి చూస్తే బిత్తర పోవాల్సిందే..!

సోషల్ మీడియాలో వైరల్‌ వీడియోలకు కొదువ లేదు. మనుషులు చేసే వింత పనులు, విచిత్ర చేష్టలు, కొందరు చేసే జుగాఢ్‌ వీడియోలు ఎప్పుడూ వైరల్‌ అవుతూనే ఉంటాయి. అలాగే, జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇకపోతే పాములకు సంబంధించిన వీడియోలను జనం మరింత ఎక్కువగా చూస్తారు. లైక్ చేస్తుంటారు. తాజాగా అలాంటిదే పాము వీడియో ఒకటి నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఈ వీడియోలో ఒక పాము ఓ ఇంటి ముందు తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ పాము తలపై ఎవరూ ఊహించనిది ఏదో ఒకటి మెరుస్తూ కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Snake Viral Video: తలపై నాగమణితో ఊళ్లోకి వచ్చిన నాగుపాము.. దగ్గరకు వెళ్లి చూస్తే బిత్తర పోవాల్సిందే..!
Snake Roaming With

Updated on: Aug 26, 2025 | 3:57 PM

వైరల్‌ వీడియోలో ఒక నాగుపాము సంచారం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఈ పాము తలపై ఏదో ఒక వింత వస్తువు కనిపించింది. అదేంటో తెలియక స్థానికులు ఆశ్చర్యపోయారు. దాని వెంటపడి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ నాగుపాము తలపై నాగమణితో తిరుగుతుందని భావించారు. నాగుపాము తలపై నాగమణి ఉందని భావించిన కొందరు యువకులు దానికి సంబంధించిన వీడియోను షూట్ చేశారు. అలా దగ్గరకు వెళ్లి చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తలపై నాగమణి ఉందని భావించిన వాళ్లంతా అక్కడి జరిగిన వాస్తవం తెలుసుకుని బిత్తరపోయారు.

పాపం ఆ పాము తల ప్లాస్టిక్ బాటిల్ మూతలో ఇరుక్కుపోయింది. దాన్ని నుంచి బయట పడేందుకు నానా తంటాలు పడింది. దానికి వెళ్లే దారి కనపడక ఇష్టమొచ్చినట్టు తిరగడం మొదలు పెట్టింది. ఎక్కడికి పోవాలో తెలియక తికమక పడుతూ జనం మధ్యలోనే ఎక్కువగా సంచరించ సాగింది. అది చూసిన స్థానికులు నాగుపాము తలపై నాగమణితో వచ్చిందని భావించారు. కానీ, ఆ నోరులేని మూగజీవి మాత్రం మనుషులు చేసిన తప్పుతో తల్లడిల్లిపోయింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

అయితే, ఈ వీడియో గత కొన్ని నెలలుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని బట్టి మనుషులుగా మనం చేస్తున్న తప్పును పదే పదే గుర్తు చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ వాడిపడేసిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌, కప్పులు, కవర్ల వల్ల అమాయక ప్రాణులతో పాటు ప్రాణాంతకమైన పాములు వంటి విష సర్పాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది తీవ్రంగా స్పందించారు. అయ్యో పాపం అంటూ.. ఆ పాము పడుతున్న పాట్లు చూసి జాలి పడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేదుకు ఎవరికి వారుగా అవగాహన కలిగి ఉండాలని పలువురు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..