Watch: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. అస్సలు నమ్మలేని అరుదైన దృశ్యం! వీడియో వైరల్‌

వైరల్‌ వీడియోలో కనిపిస్తున్న నాగమణి ప్రత్యేక కాంతిని వెదజల్లుతుంది. ఈ వెలుగు ద్వారానే నాగులు చీకట్లో కూడా కదలగలుగుతాయని చెబుతారు. తలపై నాగమణిని ధరించిన పాములు ఆపదలో దానిని మింగేస్తాయట. ఇప్పుడు నాగమణికి రక్షణగా ఉన్న ఒక పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలను ఆశ్చర్యపోతున్నారు.

Watch: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. అస్సలు నమ్మలేని అరుదైన దృశ్యం! వీడియో వైరల్‌
Snake Gaurding Nagamani

Updated on: Aug 19, 2024 | 2:30 PM

ప్రాచీన భారతీయ పురాణాలలో నాగమణి గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా సినిమాలు పాములు, నాగమణికి సంబంధించి చూస్తుంటాం. ఈ నాగమణి అనేది ఒక ప్రత్యేక రత్నం. కొంతమంది దీనిని నాగ మాణిక్య, నాగరత్నం అని కూడా పిలుస్తారు. ఇది నాగ లోకం నుండి వచ్చిన రత్నమని చాలా మంది నమ్ముతారు. నాగమణిని కంటితో సులభంగా చూడలేమని కూడా చెబుతుంటారు. నాగమణి అనే ఈ ప్రత్యేక రత్నాన్ని నాగుపాము తలపై లభిస్తుందని సాధారణంగా అందరూ నమ్ముతారు. పురాణాల ప్రకారం, పాతాళంలోని నాగలోకంలో 9 రకాల నాగుల తలపై నాగమణి కనిపిస్తుందని విశ్వాసం.అయితే, అలాంటి నాగమణికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ వీడియోలో కనిపిస్తున్న నాగమణి ప్రత్యేక కాంతిని వెదజల్లుతుంది. ఈ వెలుగు ద్వారానే నాగులు చీకట్లో కూడా కదలగలుగుతాయని చెబుతారు. తలపై నాగమణిని ధరించిన పాములు ఆపదలో దానిని మింగేస్తాయట. ఇప్పుడు నాగమణికి రక్షణగా ఉన్న ఒక పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలను ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

నాగమణి కోసం కాపలాగా కూర్చున్న నల్లటి నాగుపామును చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రాత్రి సమయంలో ఆ పాము నాగమణికి కాపలాగా ఉంది. వీడియో చూసిన వారు షాక్ అయ్యారు. వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఎక్కడ, ఎప్పుడు రికార్డ్ చేశారు అనే సమాచారం లేదు. కానీ, వీడియో మాత్రం నెటింట తెగ చక్కర్లు కొడుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..