AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 20 పెద్ద పులులను కాపుకాసిన ఒకే ఒక్కడు.. ఎలా సాధ్యం ఇది.. షాకింగ్ వీడియో..

సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు సరదా వీడియోలను నెటిజన్లు ఆస్వాధిస్తారు. ఎక్కువగా చూస్తూ.. వాటిని షేర్ చేస్తుంటారు. అదే సమయంలో మరికొన్ని వీడియో మరింత ఆసక్తిని రేపుతూ

Viral Video: 20 పెద్ద పులులను కాపుకాసిన ఒకే ఒక్కడు.. ఎలా సాధ్యం ఇది.. షాకింగ్ వీడియో..
Tiger Vs Man
Shiva Prajapati
|

Updated on: Dec 20, 2022 | 8:30 AM

Share

సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు సరదా వీడియోలను నెటిజన్లు ఆస్వాధిస్తారు. ఎక్కువగా చూస్తూ.. వాటిని షేర్ చేస్తుంటారు. అదే సమయంలో మరికొన్ని వీడియో మరింత ఆసక్తిని రేపుతూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వీడియోల్లో ఎక్కువగా జంతువులవే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెటిజన్ల ఫ్యూజులు ఔట్ చేస్తోంది. సాధారణంగా మనం పులిని లైవ్‌లో చూడటానికి ఇష్టపడుతాం. కానీ, దాని దగ్గరికి వెళ్లే సాహసం చేస్తామా? అంటే చావుకు వెల్‌కమ్ చెప్పడమే కాబట్ట అంత సీన్ లేదనే చెబుతాం.

కానీ, ఇక్కడ ఓ వ్యక్తి పులిని నేరుగా చూడటమే కాదు.. ఏకంగా పులులు ఉన్న గదిలోకి సింగిల్‌గా ఉన్నాడు. చేతిలో ఒక కర్ర పట్టుకుని.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పులులను కాపుకాశాడు. బయటి నుంచి గది గేట్ తీసే వరకు కర్ర పట్టుకుని ధైర్యంగా అలాగే నిలబడ్డాడు. మరోవైపు పులుల మంద ఓ పక్కకు నిల్చుని భయం భయంగా అతన్నే చూస్తూ ఉన్నాయి. ఇంతలో టైగర్ ఎన్‌క్లోజర్ గేట్స్ ఓపెన్ చేయగా.. అక్కడ నిలబడ్డ వ్యక్తి కర్రతో వాటిన అదిలించాడు. దెబ్బకు బెదిరిపోయిన పులులు.. భయంతో బయటకు పరుగులు తీశాయి. అయితే, ఒక్కో పులి.. కనీసం 200 కిలోలపైనే ఉంటుంది. అంతటి భారీ పులలను సైతం భయపెట్టిన గనుడు ఎవరో గానీ.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా తెగ వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతటి ధైర్యం ఎలా సామీ అని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే.. ఆ పులులకు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మనుషులకు భయపడుతున్నాయని, లేదంటే సీన్ వేరే ఉండేదని అంటున్నారు.

View this post on Instagram

A post shared by Earth Reels (@earth.reel)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..