AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మామిడి కోయడమే కాదు.. రాలిన పండు తీసుకున్నా.. రూ.35లక్షల జరిమానే! ఎక్కడంటే?

మనం ఎక్కడికైనా వెళ్తుంటే రోడ్డు పక్కన మామిడి తొట కనిపించి, దాని కింద కొన్ని పండ్లు రాలి పడితే మనం ఏం చేస్తాం? వెంటనే దాన్ని కోసుకోవడమో లేదా ఏరుకోవడమో చేస్తాం. కానీ, ఇక్కడో దేశంలో మాత్రం ఇలా చేస్తే జేబు ఖాళీ అవ్వడం ఖాయం. అవును ఆ దేశంలో యజమానుల అనుమతి లేకుండా చెట్టుకు ఉన్న పండ్లు కోసినా, కిందపడిన పండ్లు తీసుకున్నా రూ.3.5లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందట. ఇంతకూ ఈ రూల్స్ ఏ దేశంలో ఉన్నాయనేగా మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.

Viral: మామిడి కోయడమే కాదు.. రాలిన పండు తీసుకున్నా.. రూ.35లక్షల జరిమానే! ఎక్కడంటే?
Singapore Fruit Picking Fine
Anand T
|

Updated on: May 18, 2026 | 11:09 AM

Share

మన దేశంలో మామిడి తోటలోకి దూరినా, పళ్లు కోసినా పెద్దగా అడిగేవాళ్లే ఉండరు. కానీ సింగపూర్ లాంటి దేశాల్లో మాత్రం అలా కాదు. అక్కడ యజమానుల పర్మిషన్ లేకుండా మామిపళ్లు కోసినా , రాలినవి తీసుకున్నా జేబు ఖాళీ అవ్వడం ఖాయం. ఎందుకంటే సింగపూర్‌లోని బహిరంగ ప్రదేశాల్లో పెరిగే చెట్ల నుండి పండ్లను కోయడం లేదా అనుమతి లేకుండా కింద పడిన పండ్లను ఏరడం వంటివి చేస్తే ఏకంగా 5,000 సింగపూర్ డాలర్ల అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.5 లక్షలు వరకు జరిమానా విధిస్తారట.

సాధారణంగా సింగపూర్‌లో ప్రజలు తిరిగే బహిరంగ ప్రదేశాలలో, రోడ్ల పక్కన మామిడి చెట్లతో సహా అనేక రకాల పండ్ల చెట్లను పెంచుతారు. అయితే, వాటిపై కాసే పండ్లను లేదా బెర్రీలను ప్రజలెవరూ కోయకూడదని అక్కడి చట్టం చెబుతోంది. ఎందుకంటే ఆ దేశంలో ఈ పండ్లను ప్రభత్వ ఆస్తిగా భావిస్తారట. కాబట్టి ఇక్కడ పండు వాటంతట అదే నేల మీద పడినా, ప్రజలు వాటిని ముట్టుకోకూడదట. ఒకవేళ అలా చేస్తే, చట్ట ప్రకారం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేన.

ఈ విషయాన్ని సింగపూర్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ప్రియాంక సిన్హా అనే మహిళ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ఇక్కడ పబ్లిక్‌ పేస్లలో ఉండే పండ్ల చెట్లను ప్రభుత్వ ఆస్తకిగా భావిస్తారు. కాబట్టి ఈ ప్రదేశాల్లో ఉన్న చెట్ల నుంచి రాలిన పండ్లను ఏరినా జరిమానా విధిస్తారు అని చెప్పుకొచ్చింది. ఒక వేళ భారతీయులు ఎవరైనా ఇక్కడ నివసిస్తుంటే ఈ విషయాన్ని గుర్తించుకోవాలిన తెలిపింది. అయితే ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. మన దేశంలో ఇలాంటి రూల్స్ అస్సలు పనిచేయవని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

అయితే ఇక్కడి ప్రభుత్వ భూమిలోని చెట్లు, వాటి పండ్లతో సహా అన్నీ ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటాయి. వాటిని జాతీయ ఉద్యానవనాల బోర్డు చూసుకుంటుందట. ఒక వేళ మీరు ఈ చెట్ల కింద రాలిన పండ్లను తీసుకోవాలి అనుకుంటే ముందు ఈ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే పబ్లిక్ పార్కుల్లో, నేషనల్‌ పార్కుల్లో జరిమానాలు వేరువేరుగా ఉన్నాయి. పబ్లిక్ పార్కుల్లోని చెట్ల పండ్లను కోస్తే రూ.3.5లక్షలు, అదే జాతీయ పార్కుల్లోని చెట్ల పండ్లను కోస్తే రూ.35లక్షల వరకు జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us