అటవీ ప్రాంతంలో ఉండే రైల్వే ట్రాక్‌ను దాటేటప్పుడు కొన్ని ఏనుగులు గాయపడడం లాంటి ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. గజరాజుల గుంపును గమనించి లోకో పైలట్లు రైలు బ్రేకులు వేస్తున్నప్పటికీ అప్పటికే సమయం దాటిపోవడంతో ప్రమాదాలు ఆగలేకపోతున్నాయి. అయితే వీటిని నివారించేందుకు అధికారులు ఓ సరికొత్త ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల్లో క్రాసింగ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలు ఆపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అస్సాం అటవీశాఖ అధికారులు ఏనుగులను దాటించేందుకు వినూత్న ఆలోచన చేశారు.
ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటేందుకు ఓ ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు. సుశాంత నంద అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియో జంతు ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
An effective way to reduce elephant deaths on Railway tracks. Ramp for the gentle giants to cross the tracks is a much simpler way to reduce the conflict.
Source:Assam FD pic.twitter.com/VZfwPjfwHG— Susanta Nanda (@susantananda3) May 31, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..