Viral Video: అందంపై పిచ్చి పీక్ స్టేజ్.. ముఖానికి సరికొత్త రూపం కోసం బోన్స్‌ను విరగగొట్టుకుంటున్న యువత..

|

Oct 03, 2023 | 12:31 PM

ఈ అసంబద్ధ ధోరణికి సంబంధించి ఒక ప్రత్యేక వాదన తెరపైకి వచ్చింది. ముఖం ఎముకలపై సుత్తితో కొట్టుగోవడం వల్ల అందం పెరుగుతుందని వాదిస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు ఎవరికి  తెలియదు. కానీ ముఖ ఎముకలను గాయపరచుకోవడం వలన ఖచ్చితంగా కోరి మరీ కొత్త ప్రమాదాలను  ఆహ్వానిస్తున్నారని చెప్పవచ్చు అని అంటున్నారు.

Viral Video: అందంపై పిచ్చి పీక్ స్టేజ్.. ముఖానికి సరికొత్త రూపం కోసం బోన్స్‌ను విరగగొట్టుకుంటున్న యువత..
Viral Video
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో.. టిక్ టాక్ లో ఓ వింత చర్య ట్రెండ్ గా మారి చర్చనీయాంశంగా మారింది. ‘బోన్ స్మాషింగ్’ ..అంటే ప్రజలు తమ ముఖాలపై తామే సుత్తి, సీసాలతో కొట్టుకోవడం అన్న మాట.. అవును, మీరు సరిగ్గా చదివారు. టిక్‌టాక్‌లో ‘బోన్ స్మాషింగ్ ట్యుటోరియల్’ పేరుతో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పటి వరకు 26 కోట్ల మందికి పైగా వీక్షించారు. అయితే ఇలా బోన్ ను విరగొట్టునే పిచ్చిపని వలన  ప్రజలు ఏమి లాభం పొందుతున్నారనే ప్రశ్నలు చూపరుల మనస్సులో తలెత్తుతుంది.

ఈ అసంబద్ధ ధోరణికి సంబంధించి ఒక ప్రత్యేక వాదన తెరపైకి వచ్చింది. ముఖం ఎముకలపై సుత్తితో కొట్టుగోవడం వల్ల అందం పెరుగుతుందని వాదిస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు ఎవరికి  తెలియదు. కానీ ముఖ ఎముకలను గాయపరచుకోవడం వలన ఖచ్చితంగా కోరి మరీ కొత్త ప్రమాదాలను  ఆహ్వానిస్తున్నారని చెప్పవచ్చు అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

కొంతమంది ఒక విచిత్రమైన ధోరణిలో తమ ముఖంపై దాడి చేసుకుంటూ ఎముకలకు కొత్త ఆకృతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తాము కోరుకున్న ఫేస్ కట్‌ను పొందగలుగుతున్నామని పేర్కొన్నారు.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ వింత ట్రెండ్‌ని అనుసరించే వారు తమ ముఖాన్ని సుత్తితో కొట్టిన తర్వాత తమ  చిత్రాలు, వీడియోలను టిక్‌టాక్‌లో షేర్ చేస్తున్నారు.

ఈ ధోరణిని సమర్థిస్తున్న కొందరు జర్మన్ శరీర నిర్మాణ శాస్త్రవేత్త, సర్జన్ జూలియస్ వోల్ఫ్ పేర్కొన్న నియమాలను ఉదహరిస్తున్నారు. 19వ శతాబ్దంలో జర్మన్ సర్జన్లు సుత్తితో కొట్టి ముఖాన్ని బాగు చేసేవారు. ఈ ప్రక్రియలో దెబ్బతిన్న ఎముకలు నాశనమయ్యి.. వాటి స్థానంలో కొత్త ఎముకలు వస్తాయి.

ఎముకలను పగులగొట్టడం వెనుక ఉన్న వాదన ఏమిటంటే

ఇలా ముఖంపై ఉన్న ఎముకలను పగలగొట్టుకోవడం వలన ముఖ పునర్నిర్మాణంలో సహాయపడుతుందని..  ఎముకలు మరింత దృఢంగా మారతాయని పేర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు చాలా మంది టిక్‌టాక్ వినియోగదారులు తమ ముఖాకృతిని మార్చుకోవడానికి ఎముకలు పగులగొట్టుకునే పనిని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని వైద్యులు అంటున్నారు. ఎముకకు పదేపదే గాయాలు అవ్వడం అనేక నష్టాలు కలిగిస్తాయని చెబుతున్నారు. అంతేకాదు ఒకొక్కసారి జీవితకాల వైకల్యానికి కూడా పరిస్థితులు దారి తీయవచ్చు అని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..