బాబోయ్‌.. చిరుతను వేటాడిన నరమాంస భక్షక కుక్కలు..! రౌండప్ చేసి గురిపెట్టాయి

|

Aug 30, 2024 | 12:29 PM

వైరల్‌ వీడియోలో కుక్కల గుంపు చిరుతపులిని చుట్టుముట్టి దాడి చేసింది. చిరుతను రౌండప్ చేసిన గ్రామ సింహలు దాన్ని ఊపిరాడకుండా చేశాయి. ఇదంతా దూరంగా ఉన్న వ్యక్తులు ఎవరో వీడియో తీశారు. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తులు సైతం ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు.

బాబోయ్‌.. చిరుతను వేటాడిన నరమాంస భక్షక కుక్కలు..! రౌండప్ చేసి గురిపెట్టాయి
Dogs And Leopard Fight
Follow us on

అడవిలో జీవించడానికి ఒకే ఒక నియమం ఉంటుంది. బలవంతుడు, శక్తిమంతుడు మాత్రమే ఇక్కడ జీవించగలడు. ఎందుకంటే..క్రూర జంతువుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు చిన్న జంతువులు అక్కడక్కడ దాక్కుంటూ దొరికిన ఆహారం తిని జీవిస్తుంటాయి. మరోవైపు అడవిలోని మాంసాహార జంతువులు తమ వేట కోసం వెంబడిస్తూ, అడవిలో కనిపించిన ఎర క్రూరంగా వేటాడుతుంటాయి. ఇదంతా రివర్స్‌లో జరుగుతూ ఉంటుంది. అడవికి రాజులా జీవించే సింహాం, పులి కూడా కుక్కలు, గేదెలకు భయపడి పారిపోయిన ఘటనలు చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది.

అడవిలో భయంకర జంతువు సింహం, చిరుతలు వాటికి కనిపించిన ఏ చిన్న జీవిని కూడా విడిచిపెట్టకుండా చంపేస్తాయి. అందుకే వీటిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఇది రెప్పపాటులో తన ఎరపైకి దూసుకెళ్లి చంపేస్తుంది. కానీ, ఇక్కడ కుక్కల దాడిలో చిరుత ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో కుక్కల గుంపు చిరుతపులిని చుట్టుముట్టి దాడి చేసింది. చిరుతను రౌండప్ చేసిన గ్రామ సింహలు దాన్ని ఊపిరాడకుండా చేశాయి. ఇదంతా దూరంగా ఉన్న వ్యక్తులు ఎవరో వీడియో తీశారు. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తులు సైతం ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. వారంతా బిగ్గరగా అరవటం కనిపించింది. కానీ, నరమాంస భక్షకంగా మారిన కుక్కలు చిరుతను చిల్చీ చెండాడినట్టుగా చంపేశాయి. ఈ షాకింగ్ వీడియో నెటిజన్లు సైతం భయబ్రాంతులకు గురి చేసింది.

ఈ వీడియో చూడండి..

ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. బాబోయ్ ఈ కుక్కలు నరభక్షకులుగా మారాయి.. చిరుతపులిని కూడా విడిచిపెట్టలేదని వ్యాఖ్యనించారు. వీడియో ఎక్కడ రికార్డ్ చేశారో తెలియదు గానీ, నెట్టింట మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..