AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రాత్రి కూలిపోయిన 200 ఏళ్ల నాటి రావి చెట్టు.. పొద్దున్నే అక్కడికి వెళ్లగా వేర్ల కింద కనిపించిన అద్భుతం

ఇది నిజంగా అద్భుతమే. ఎప్పుడో 200 ఏళ్ల క్రితం నాటి రావి చెట్టు అది. ఇటీవల గాలలకు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన స్థానికులు ఒక్కసారిగా భక్తి పారవశ్యానికి లోనయ్యారు.

Viral: రాత్రి కూలిపోయిన 200 ఏళ్ల నాటి రావి చెట్టు.. పొద్దున్నే అక్కడికి వెళ్లగా వేర్ల కింద కనిపించిన అద్భుతం
Shivling
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2022 | 9:54 AM

Share

Trending: అది భారీ రావి చెట్టు. సుమారు 200 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఇటీవల భారీ గాలులు వీయడంతో అది కిందపడింది. దీంతో ఆ చెట్టును పరిశీలించేందుకు వెళ్లిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ చెట్టు వేర్ల భాగంగో ఏకంగా 5 శివలింగాలు బయటపడ్డాయి. ఒక శివలింగం పెద్దది కాగా మిగిలిన నాలుగు చిన్నవి. దీంతో గ్రామస్థులు భారీగా అక్కడికి చేరుకుని పూజలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఫిరోజాబాద్(Firozabad) పట్టణంలోని ముస్తఫాబాద్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో అక్కడ గుడి నిర్మాణం చేసేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… ముస్తఫాబాద్ నివాసి విజయ్‌పాల్ సింగ్ పూర్వికులు వారి పొలంలో సుమారు 200 సంవత్సరాల క్రితం ఓ రావి మొక్కను నాటారు. అది ఓ పెద్ద మహావృక్షం అయిపోయింది. అయితే ఇటీవల ఆ చెట్టు ఒక్కసారిగా కూలింది. గ్రామస్థులు చెట్టు దగ్గరకు వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. చెట్టు వేర్ల భాగంలో ఐదు తెల్లని పాలరాతి శివలింగాలు ఉన్నాయి. చెట్టు కింద శివలింగాలతో పాటు పార్వతి, నంది, గణేశుడు, కార్తికేయ విగ్రహాలతో పాటు మరో నాలుగు దేవతల ప్రతిమలు కూడా కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. ఇది శివ మహిమగా భక్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు.

గ్రామపెద్ద మనోజ్ యాదవ్ మాట్లాడుతూ..   శివలింగాలు బయల్పడిన చోట భారీ ఆలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం పొలం యజమాని విజయ్‌పాల్‌, అతని కుటుంబ సభ్యులు ఒక బిగానికి పైగా భూమి ఇచ్చేందుకు అంగీకరించనట్లు వివరించారు. (Source)

మరిన్ని జాతీయ వార్తల కోసం..