Ghosts In Dream: కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

|

Jun 18, 2021 | 9:32 PM

అందరిలోనూ కామన్‌గా ఉండే భయం పేరు ‘దెయ్యం’. చాలామందికి దెయ్యాలంటే చచ్చేంత భయం. దెయ్యాలపై పరిశోధనలు చేసేవారు.. అవి ఉన్నాయంటూ..

Ghosts In Dream: కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?
Ghost
Follow us on

అందరిలోనూ కామన్‌గా ఉండే భయం పేరు ‘దెయ్యం’. చాలామందికి దెయ్యాలంటే చచ్చేంత భయం. దెయ్యాలపై పరిశోధనలు చేసేవారు.. అవి ఉన్నాయంటూ కొన్ని ఆధారాలు చూపిస్తుంటారు. కానీ వాటిని ఎవ్వరూ నమ్మరు. అందుకే ఇప్పటికీ దెయ్యాల కాన్సెప్ట్‌పై వాటిని నమ్మేవారు, నమ్మని వారి మధ్య తరచూ చర్చలు జరుగుతుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విస్తరించడంతో యువత ఈ దెయ్యాల కాన్సెప్ట్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆ దెయ్యాల కాన్సెప్ట్‌పై మనం కూడా ఓ విషయాన్ని తెలుసుకుందాం.

మీకు కలలో దెయ్యం కనిపిస్తే ఏమవుతుంది.? అసలు దానికి అర్ధం ఏంటి.? మంచి జరుగుతుందా.! లేదా చెడు జరుగుతుందా.? ఇలా అందరిలోనూ పలు ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. దెయ్యాల కలలు ఖచ్చితంగా చాలా భయానకంగా ఉంటాయి. అవి ఖచ్చితంగా వ్యక్తి మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఏ వ్యక్తి అయినా కూడా కలలో దెయ్యాలను చూసిన తర్వాత భయభ్రాంతులకు గురవుతాడు.

ఇదిలా ఉంటే కలలో దెయ్యాలను, లేదా భయపెట్టే బొమ్మలను చూడటం చెడును ప్రతీక అని ప్రసిద్ధ జ్యోతిష్కుడు రాజేష్ శుక్లా అన్నారు. అలాంటి కలలు మన జీవితంలో చెడు సంకేతాలను సూచిస్తాయని తెలిపారు. దెయ్యాలు నెగటివ్ ఎనర్జీకి ప్రతీకలు. దెయ్యాలను గానీ, భయపెట్టే బొమ్మలను గానీ కలలో చూస్తే.. మీకు ఆర్ధిక నష్టం, ఇబ్బందులు, వంచనను పొందవచ్చు. ఒకవేళ కలలో దెయ్యాలు ఎగురుతూ కనిపిస్తే.. మీకు శత్రువుల నుంచి హాని పొంచి ఉండే అవకాశం ఉందట.