తేలు విషం అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారు.. లీటరు ధర ఎంతో తెలుసా..?

చూసేందుకు చిన్నగానే ఉంటాయి. కానీ,అది కాటు వేసిందంటే ఒక్కొసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. పాముల మాదిరిగానే కొన్ని తేళ్లు కూడా ప్రమాదకరమైనవే. తేలు కాటు తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. అంతేకాదు.. కొన్ని రకాల తేళ్లు ప్రాణాంతకం కావచ్చు. అందుకే తేళ్లకు కూడా దూరంగా ఉంటారు. కానీ కొంతమంది తేళ్ల పెంపకం ద్వారా లక్షలాది, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తేలు విషం అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారు.. లీటరు ధర ఎంతో తెలుసా..?
Scorpion Farms

Updated on: Mar 25, 2025 | 5:39 PM

సాధారణంగా మన దేశంలో వ్యవసాయం ఎక్కువ. చాలా ప్రాంతాల్లో రైతులు వరి, జొన్న, మొక్కజొన్న, గోధుమ, ఇతర వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, పండ్లు కూడా పండిస్తుంటారు. సేద్యంతో పాటు ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు మొదలైన జంతువులను కూడా పెంచుతారు. కొన్ని చోట్ల పాములను పెంచుకునే వారు కూడా ఉన్నారు. అదేవిధంగా, విషపూరిత తేళ్లను పెంచుకునే వారు కూడా ఉంటారని ఎప్పుడైనా విన్నారా..? అవును మీరు చదివింది నిజమే.. తేళ్లను పెంచుతూ వాటి విషాన్ని అమ్ముతూ ధనవంతులుగా మారిన వ్యక్తులు కూడా ఉన్నారు. తేళ్ల పెంపకం ద్వారా కొందరు లక్షలు, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మనం ఊహించలేని కొన్ని వింతలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు, అలాంటి ఒక వీడియో వైరల్ అయింది. ఇది లాభదాయకమైన తేళ్ల పెంపకం వ్యాపారం. తేలు విషాన్ని అనేక మందులు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ తేళ్ల విషాన్ని అమ్మడం ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించే వ్యక్తులు ఉన్నారు. ప్రతి తేలు రోజుకు దాదాపు 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దాని ఒక లీటరు విషం ధర దాదాపు $10 మిలియన్ డాలర్లు. క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులకు మందులను తయారు చేయడానికి తేలు విషాన్ని ఉపయోగిస్తారట. అంతర్జాతీయ మార్కెట్లో 1 లీటరు తేలు విషం రూ. 85 కోట్లకు పైగా అమ్ముడవుతోంది. తేళ్ల పెంపకానికి సంబంధించిన ఒక ఉత్తేజకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

మార్చి 20న సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోకు 90,000 కంటే ఎక్కువ వ్యూస్‌, అనేక కామెంట్స్‌ వచ్చాయి. ఇది నిజంగా ఎంతో ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉంది అంటూ ఒకరు వ్యాఖ్యనించగా, ఇది నమ్మశక్యంగా లేదంటూ మరొకరు పేర్కొన్నారు. ఈ చిన్న జీవి చాలా విలువైనది అంటూ ఇంకొకరు కామెంట్‌ రాశారు. ఇది నా కలల వ్యాపారం అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..