
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పరిశోధకులు అరుదైన దృశ్యాన్ని గమనించారు. పింక్ రివర్ జాతికి చెందిన డాల్ఫిన్ ల సమూహం ఆసాధారణ ఫ్రెండ్ తో ఆటలాడుతున్న అరుదైన దృశ్యాన్ని వారు చూశారు. ఆ అసాధారణ ఫ్రెండ్ ఎవరో కాదు.. భారీ అనకొండ. అవును, అందమైన డాల్ఫీన్స్ భయంకర అనకొండతో ఆడుకుంటున్న దృశ్యం చూసిన పరిశోధకులు తొలుత షాక్ అయ్యారు. ఆగస్టు 2021లో బొలీవియాలోని నోయెల్ కెంఫ్ మెర్కాడో మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ నిపుణులు ఈ దృశ్యాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు ఎకాలజీ జర్నల్ లో ప్రచురించారు. ఈ మేరకు పూర్తి వివరాల్లోకి వెళితే..
బొలీవియాలోని టిజముచి నదిలో బోటోస్ అని పిలువబడే అమెజాన్ రివర్ డాల్ఫిన్ ల గుంపు పెద్ద అనకొండతో ఆడుతున్న దృశ్యాన్ని వారు ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడి దృశ్యాలను వారు తమ కెమెరాల్లో బంధించారు. డాల్ఫిన్లు కనిపిస్తేనే దాడి చేసి ఆహారంగా మార్చుకునే అనకొండ వాటికి ఎలాంటి హాని చేయకుండా ఆటలాడటం చూసి వారంతా ఆశ్చర్య పోయామంటూ వెల్లడించారు. ఆ డాల్ఫిన్లు సైతం అనకొండను నోటిలో పట్టుకుని, నీళ్లలో ఈదుతున్నట్టుగా కనిపించాయని చెప్పారు. జాతి వైరాన్ని మరిచి డాల్ఫిన్లు, అనకొండ ఆటలాడుతుండటం తమని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. దగ్గరగా పరిశీలించినప్పుడు డాల్ఫిన్లు శ్వాస తీసుకోవడానికి మాత్రమే ఉపరితలంపైకి రావడం లేదని చెప్పారు. కానీ, ఈ ప్రత్యేక సందర్భంలో, పరిశోధకులు వాటి అసాధారణ ప్రవర్తనపై ఆసక్తి చూపారు. ఎందుకంటే అది నిరంతరం బయటపడుతోంది. అవి ఒక పెద్ద అనకొండతో సంకర్షణ చెందుతున్నాయని తేలింది.
ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా కనిపిస్తాయని బ్రెజిల్ లోని యూనివర్సిడేడ్ ఫెడరల్ డో రియో గ్రాండే డో సుల్ లో వర్గీకరణ శాస్త్రవేత్త ఒమర్ ఎంటియాస్పే-నెటో తెలిపారు. అయితే, ఆ సమయంలో అనకొండ గురించి పలువురు శాస్త్రవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు. డాల్ఫిన్లు దానితో ఆడుకునే సమయానికి అనకొండ చనిపోయి ఉంటుందా ..? అని కూడా సందేహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి పరిశోధన జరగాల్సిన అవసరం ఉందంటూ మరికొందరు పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..