తవ్వకాల్లో 11 వేల ఏళ్ల నాటి ఇల్లు లభ్యం.. గ్రైండింగ్ మిల్లులు, ఆభరణాల సహా అనే వస్తువులు వెలుగులోకి..

భూమి లోపల సముద్రం అట్టడుగు పొరల్లో ఎక్కడోచోట మన పూర్వీకులకు సంబంధించిన ఆనవాళ్ళు అవశేషాలు దొరుతూనే ఉన్నాయి. తాజాగా అరేబియా ద్వీపకల్పంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మానవ నివాసాన్ని సౌదీ అరేబియా కనుగొంది. ఈ స్థావరం 11,000 సంవత్సరాల నాటిది. ఈ ఆవిష్కరణ మస్యున్ ప్రదేశంలో జరిగింది. తవ్వకాలలో బయల్పడిన పురాతన మానవ నివాసం గురించి తెలుసుకుందాం.

తవ్వకాల్లో 11 వేల ఏళ్ల నాటి ఇల్లు లభ్యం.. గ్రైండింగ్ మిల్లులు, ఆభరణాల సహా అనే వస్తువులు వెలుగులోకి..
Tabuk Pre Pottery Neolithic Era

Updated on: Sep 29, 2025 | 11:16 AM

అరేబియా ద్వీపకల్పంలో అత్యంత పురాతనమైన మానవ స్థావరాన్ని కనుగొన్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ప్రస్తుతం ఇది 11,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని అంచనా. సాంస్కృతిక మంత్రి, హెరిటేజ్ కమిషన్ చైర్మన్ ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో ఈ ఆవిష్కరణను ప్రకటించారు. ఈ ఆవిష్కరణను ఆయన ముఖ్యమైనదిగా అభివర్ణించారు. తబుక్ ప్రాంతానికి వాయువ్యంగా ఉన్న మస్యోన్ ప్రదేశం.. ప్రీ-పాటరీ నియోలిథిక్ కాలం (11,000-10,000 సంవత్సరాల క్రితం) నాటిది.

సౌదీ హెరిటేజ్ కమిషన్ ప్రకారం ఈ ప్రదేశంలో మానవ ,జంతువుల అవశేషాలు లభ్యం అయ్యాయి. వీటిలో రాతి నివాస నిర్మాణాలు, రాతి ధాన్యం గ్రైండింగ్ మిల్లులు , షెల్, రత్నాలతో చేసిన ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆవిష్కరణ సౌదీ అరేబియా పురావస్తు పరిశోధన పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుంది. అరేబియా ద్వీపకల్పంలో చరిత్రపూర్వ మానవ జీవితాన్ని అర్థం చేసుకోవడంలో గణనీయంగా పురోగతి సాధిస్తుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

తవ్వకాలలో ఏమి కనుగొనబడ్డాయంటే

మసూన్ ప్రదేశం మొదట 1978లో జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్‌లో నమోదు చేయబడింది. డిసెంబర్ 2022లో తిరిగి తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇది ఈ ప్రాంతం ప్రాముఖ్యతను మరింత పెంచింది. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో మే 2024 నాటికి పూర్తయిన నాలుగు ఫీల్డ్ సెషన్‌లు అర్ధ వృత్తాకార రాతి నిర్మాణాలు, నిల్వ స్థలాలు, మార్గాలు, పొయ్యిలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు పురావస్తు శాస్త్రవేత్తలు రాతి బాణపు ముళ్ళు, కత్తులు, గ్రైండింగ్ సాధనాలతో పాటు అమెజోనైట్, రత్నాలు వంటి వాటితో తయారు చేసిన ఆభరణాలను కూడా వెలికితీశారు. సమీపంలోని రాళ్ళు కళ , శాసనాలు, ప్రారంభ చేతిపనుల, రోజువారీ జీవితానికి సంబంధించిన ఆధారాలను కూడా వెల్లడించాయి.

ఈ ఆవిష్కరణ ప్రపంచ పురావస్తు పటంలో సౌదీ అరేబియా స్థానాన్ని బలోపేతం చేస్తుందని, అరేబియాలో చరిత్రపూర్వ మానవులు ఎలా జీవించారు, పనిచేశారు , వారి దైనందిన జీవితంలో పదార్థాలను ఎలా ఉపయోగించారు అనే దానిపై అవగాహన పెంచడానికి దోహదపడుతుందని హెరిటేజ్ కమిషన్ తెలిపింది.

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..